ఆరాధ్యుడు అభినవభగీరథుడు… సర్ ఆర్ధర్ కాటన్

సాహితీ సామ్రాజ్యం అద్వర్యంలో స్థానిక న్యాయవాది మండవిల్లి చినరామయ్య ఆఫీస్ ప్రాంగణమందు కాటన్ జయంతిని ఘనంగా శుక్రవారం నిర్వహించినారు. సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కర రావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్మామలంగా, అన్నపూర్ణగా తీర్చిదిద్దిన అన్నదాత, ప్రాణప్రదాత కాటన్ దేవరుడు అని అన్నారు. గ్రామీణ నీటి సరఫరాశాఖ విశ్రాంత డి. ఇ. ఇ. పేరూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతుబాంధవుడు, ప్రజలగుండెల్లో కొలువైన భగీరథుడు కాటన్ దొర అని అన్నారు.
పై సందర్భంగా ఆరాధ్యుడు అభినవభగీరథుడు కాటన్ జీవితచరిత్రపై సదస్సునిర్వహించినారు పలువురు మాట్లాడినారు.
అనంతరం విశ్రాంత గ్రామీణ నీటిసరఫరా శాఖ డి. ఇ. ఇ. పేరూరి శ్రీనివాస రావును, గ్రామీణ నీటి సరఫరా శాఖ విశ్రాంత ఏ. ఇ. సానబోయిన వెంకట సత్యనారాయణను నిర్వాహకులు ఘనంగా సత్కరించినారు.
ఇంకా ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మండవిల్లి చినరామయ్య, కౌరు వెంకటేశ్వర్లు, సీపాని శ్రీనివాసు, సామాజిక కార్యకర్త సవిరిగాని బోసు, చల్లపల్లి విజయగోపాలరావు, కోడూరి శ్రీనివాసరావు, ఆర్. వరప్రసాద్, వి. సీతారాం, జె. వెంకటేశ్వరరావు, సి. హెచ్. పవన్ కుమార్ పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link