కోస్టల్ న్యూస్: (తణుకు మే 08) గోదావరి పల్లెటూరి అందాలతో… ఆప్యాయత అనురాగాలతో పెనవేసుకున్న సాధారణ కుటుంబాల మధ్య సాగే ఇతివృత్తంతో ఆద్యంతం తండ్రీకూతుళ్ళ మధ్య, ఒక వ్యవసాయదారుని కుటుంబంలో నుండి ఆటోడ్రైవర్ గా జీవనం సాగించే హీరో, అతను పాటించే కుటుంబవిలువలు వీటిమధ్య సాగే ఒక ఇంజనీరింగ్ అమ్మాయి ఆటో అబ్బాయిని ఎలా ప్రేమించిందో దర్శకుడు రసవత్తరంగా తెరకెక్కించిన గోదారిగట్టుపైన చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ సందర్భంగా తణుకు వెంకటేశ్వర థియేటర్లో ఈ చిత్రంలో పొలీసుపాత్రలో వై.టి.మూర్తి, పెళ్ళిపంతులు పాత్రలో పురాణపండ జోగయ్యశాస్త్రి, చర్చి ఫాథర్ గా కోట రాంప్రసాద్, చర్చి సంఘసభ్యునిగా ఎస్.దొరబాబు తదితరులు తమ మిత్రులతో కలసి గొదారిగట్టుపైన చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండువేసవిలో చల్లని చెట్టునీడ లాంటి అనుభూతికల్పించి, ఆసక్తికర సన్నివేశాలతో తణుకు చుట్టుపక్కల ప్రాంతాలలో తీసిన ఈ చిత్రంలో తమకు నటించే అవకాశాన్ని కల్పించిన దర్శకులు సుభాష్ చంద్రకు, చిత్రబృందానికి కృతజ్ణతలు తెలియజేశారు



