అమరావతి:ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ అధినేత ఆర్.బి. చౌదరి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “ఆర్.బి. చౌదరి గారు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారనే వార్త నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. తెలుగు, తమిళ భాషల్లో కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి, చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న గొప్ప నిర్మాతను కోల్పోవడం సినీ రంగానికి తీరని లోటు” అని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు



