27 మంది ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి ప్రతిభావంతులకు అభినందన సత్కారం
- కలెక్టర్ కీర్తి చేకూరి
కష్టపడే వ్యక్తిత్వం, పట్టుదల, నిరంతర కృషి ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు.
మంగళవారం సాయంత్రం బొమ్మూరు కలెక్టరేట్‌లో 2025–26 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన 27 మంది విద్యార్థులకు అభినందన సభను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటిస్తూ తన చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ… పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించడం ద్వారా విద్యార్థుల్లో ఉన్నత లక్ష్యాలను చేరుకునే ధైర్యం పెరుగుతుందని తెలిపారు. కష్టపడే స్వభావం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని స్పష్టం చేశారు. ప్రయత్నం చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుందని, ఫలితాలపై ఆందోళన చెందకుండా నిరంతరం కృషి చేస్తే విజయాలు స్వయంగా వస్తాయని చెప్పారు. ఫలితాలు అనుకున్న విధంగా రాకపోయినా చదువును ఎప్పటికీ మానకూడదని సూచించారు.
తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ముఖ్యంగా ఆడపిల్లల విద్యకు ప్రాధాన్యత ఇచ్చి చిన్న వయసులో వివాహాలు చేయకుండా ఉన్నత విద్యకు ప్రోత్సహించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేసి మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేస్తోందని తెలిపారు.
జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ మాట్లాడుతూ… పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధిస్తూ దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. వారి విజయాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ… పదవ తరగతిలో సాధించిన విజయం విద్యార్థుల భవిష్యత్‌కు బలమైన పునాది వేస్తుందని తెలిపారు. ఈ విజయంతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి ఉన్నత లక్ష్యాల వైపు సాగేందుకు ప్రేరణ లభిస్తుందని అన్నారు. చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల అభివృద్ధిపైనా దృష్టి పెట్టాలని సూచించారు.
అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మ మాట్లాడుతూ… ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణతో కృషి చేస్తే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, సమాజం పట్ల బాధ్యతగల పౌరులుగా ఎదగాలని సూచించారు.
డి.ఈ.ఓ కె. వాసుదేవరావు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక వల్ల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించగలిగారని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. తల్లిదండ్రుల సహకారం కూడా ఈ విజయానికి ముఖ్య కారణమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన బోధన, మౌలిక వసతుల కల్పనతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించడం సాధ్యమైందని తెలిపారు.
విద్యార్థుల అభిప్రాయం:
తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం తమ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఐఏఎస్‌గా ఎదిగి ప్రజలకు ఉత్తమ పరిపాలన అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రతిభ కనబరిచిన మేనేజ్‌మెంట్‌వారీగా టాప్–1, 2, 3 ర్యాంకులు సాధించిన 27 మంది విద్యార్థుల వివరాలు:
అమరాపురి జెస్సికా – జెడ్పీ హైస్కూల్ ఫర్ గర్ల్స్, నిడదవోలు – 592, షేక్ షిఫా జువైరివా – మునిసిపల్ హైస్కూల్, కొవ్వూరు – 592, కాతకం నవీన్ – మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్, రాజమహేంద్రవరం – 590, చేత్లపల్లి దీపాంజలి – మునిసిపల్ హైస్కూల్, రాజమహేంద్రవరం – 590, గిడగం దుర్గ శావని – మునిసిపల్ హైస్కూల్, రాజమహేంద్రవరం – 590, గోన్నబత్తుల లలితా దేవి – మునిసిపల్ హైస్కూల్ – 589, భట్టుల దుర్గా జశ్వంత్ – ఈపీపీ హైస్కూల్, రాజంపాలెం – 588, తోట నాగ వెంకటలక్ష్మి – జెడ్పీ హైస్కూల్, మల్లేశ్వరం – 588, పిట్ట వెంకట్ – ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, లక్ష్మీనర్సాపురం – 588, దేవిన ధన్యథ – హైస్కూల్, రంగంపేట – 587, దండు రవి కిరణ్ – ఏపీఆర్‌ఈఎస్ హైస్కూల్, భూరతిపాలెం – 582, పల్లికొండ వినీల – బీసీ వెల్ఫేర్ స్కూల్, గొరలపురం – 582, గల్లా పల్లవి – బీసీ వెల్ఫేర్ స్కూల్, గొరలపురం – 581, దాసరి చేతన్ శ్రీ వెంకట్ – గవర్నమెంట్ హైస్కూల్, కొరుకొండ – 580, తనేటి ఇండు – ఏపీఎస్ డబ్ల్యూఆర్‌ఎస్ గర్ల్స్, రాజమహేంద్రవరం – 580, గొడుగుల రాజా – ఏపీఆర్ ఈఎస్ హైస్కూల్, భూరతిపాలెం – 579, గుడుదుల నాగ దుర్గ – ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ గర్ల్స్, గోపాలపురం – 579, పన్నింట్ల పాంబిక – గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్, రాజమహేంద్రవరం – 578, మహాదే అభిషేక్ – ఏపీఆర్‌ఈఎస్ హైస్కూల్, హుపాతపాలెం – 578, తన్నీరు దుర్గ లక్ష్మి – గవర్నమెంట్ మోడల్ హైస్కూల్, రాజమహేంద్రవరం – 577, సయ్యద్ షార్యా – హైస్కూల్, కొంతమూరు – 561, చల్లా తులసి సత్య – గిరిజన వెల్ఫేర్ గర్ల్స్ హైస్కూల్, బొమ్మూరు – 558, కొండేటి బాల వెంకట శ్రీ వైష్ణవి – హైస్కూల్, కొంతమూరు – 553, లుకలాపు ఝాన్సీ – హైస్కూల్, కొంతమూరు – 550, బుసాల సంలీనా – గిరిజన వెల్ఫేర్ గర్ల్స్ హైస్కూల్, బొమ్మూరు – 542, వాండ్ర లీలా భవాని – బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, గొరలపురం – 509, వియ్యపు శ్యామల – గిరిజన వెల్ఫేర్ గర్ల్స్ హైస్కూల్, బొమ్మూరు – 500.
ఈ సందర్భంగా ఎస్ ఎస్ ఎ పిడి ఎస్ సుభాషిణి, ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది



