పదో తరగతి ఫలితాల్లో నిడదవోలు విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపిన మంత్రి దుర్గేష్
నిడదవోలు విద్యార్థుల విజయం నియోజకవర్గానికి గర్వకారణం అంటూ మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసలు
విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించిన మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలులోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను,విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు అభినందనలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నిడదవోలు నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మరియు ఎయిడెడ్, ఇతర పాఠశాలల విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరచడం పట్ల రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు సాధించిన ఈ అద్భుతమైన మార్కులు వారి కష్టానికి, పట్టుదలకు నిదర్శనమని కొనియాడారు. నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా జిల్లా, రాష్ట్ర స్థాయిలోనూ మన విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, వారి విజయానికి వెన్నంటి నిలిచిన తల్లిదండ్రులకు మంత్రి దుర్గేష్ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన విద్యాశాఖ అధికారులు మరియు ఉపాధ్యాయుల కృషిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులందరూ ఇదే పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు. “చదువే సంపద అని నమ్మి, క్రమశిక్షణతో చదివిన విద్యార్థులు నిడదవోలు నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చారు. రాబోయే రోజుల్లో వీరికి ప్రభుత్వం తరపున మంచి ప్రోత్సాహం ఉంటుంది” అని మంత్రి దుర్గేష్ భరోసా ఇచ్చారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మరింత బాగా చదివి ఉత్తీర్ణత సాధించాలని దిశానిర్దేశం చేశారు..రాష్ట్రవ్యాప్తంగా ఉత్తీర్ణత శాతంపై సంతోషం వ్యక్తం చేశారు.



