సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి కందుల దుర్గేష్ అభ్యర్థన
స్వర్ణాంధ్ర స్ఫూర్తితో నిడదవోలు ప్రగతి పథం.. 21 నెలల్లో రూ. 500 కోట్ల పనులు
కూటమి పాలనలో ‘సూపర్ సిక్స్ పథకాలు సూపర్ డూపర్ హిట్’ అయ్యాయని మంత్రి దుర్గేష్ ఉద్ఘాటన
మంత్రి దుర్గేష్ నాయకత్వానికి సీఎం చంద్రబాబు నాయుడు కితాబు.. ‘నిడదవోలు అభివృద్ధి అద్భుతం’ అని ప్రశంస
గత ప్రభుత్వ వైఫల్యాలను చెరిపివేస్తూ.. ప్రజల ముంగిటకే ప్రగతి ఫలాలు: మంత్రి కందుల దుర్గేష్
ముఖ్యమంత్రి పర్యటనతో నిడదవోలులో నూతనోత్తేజం!
నిడదవోలు(సుబ్బరాజుపేట): నిడదవోలు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. శనివారం సుబ్బరాజుపేటలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘ప్రజా వేదిక’లో మంత్రి దుర్గేష్ నియోజకవర్గ ప్రగతిని వివరిస్తూనే, పెండింగ్‌లో ఉన్న కీలక సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
స్వర్ణాంధ్ర – స్వచ్ఛఆంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన సీఎం చంద్రబాబు నాయుడు కు మంత్రి దుర్గేష్ నియోజకవర్గం ప్రజలందరి తరపున ఘన స్వాగతం పలికారు. అందరికీ మార్గదర్శకులుగా, ప్రపంచంలో దార్శనికత కలిగిన నేతగా సీఎం చంద్రబాబు నాయుడును మంత్రి దుర్గేష్ అభివర్ణించారు. సమకాలీన రాజకీయాల్లో పరిపాలన దక్షతతో కూడిన అద్భుతం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వ పటిమ అన్నారు. నాటి అవిభాజ ఆంధ్ర ప్రదేశ్ ను, నేటి విభాజిత ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు, తద్వారా సాధించిన ఫలితాలు సామాన్య ప్రజలకు చేరువయ్యాయని కొనియాడారు. ఈ క్రమంలో ఆయన చూపిన దక్షత స్వర్ణాంధ్రప్రదేశ్ కు ప్రాతిపదికగా మారాయని అన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో, సీఎం చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో ఒక సభ్యుడిగా, సహచర మంత్రిగా పనిచేయడం అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. సీఎం చూపిస్తున్న ప్రగతితో సూపర్ సిక్స్ సూపర్ డూపర్ హిట్ అయిందన్నారు..
మహిళల సాధికారత కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టిందన్నారు.. స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు, దీపం 2 పథకం, తల్లికి వందనం తదితర అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. 21 నెలల కాలంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న దార్శనికుడు సీఎం చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. పర్యావరణ, ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెల మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహిస్తూ భావితరాల భవిష్యత్తుకు భరోసానిస్తున్నారని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమానికి నిడదవోలు వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు.రూ. 5.5 కోట్లతో మాలకోడు చెరువు సుందరీకరణకి.. పట్టణంలోని మురుగు నీటిని శుద్ధి చేసే ఎస్టిపీ ప్లాంట్ కి సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.1025 కోట్లతో ఎస్ టి పి ప్లాంట్స్ కి నేడు శంకుస్థాపన చేయడం గొప్ప విషయం అన్నారు.. ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిడదవోలుకు విచ్చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం పలుకుతున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. 21 నెలల్లో రూ. 500 కోట్లతో నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉండ్రాజవరం, నిడదవోలు రూరల్, పెరవలి మండలాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి తీసుకెళ్తున్న విధానం సామాన్య ప్రజల్లో ఆనందానికి కారణమైందన్నారు.
అభివృద్ధి పథంలో నిడదవోలు:
గత 21 నెలల కాలంలో నియోజకవర్గంలో రూ. 500 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, కేవలం నిడదవోలు పట్టణానికే రూ. 151 కోట్లు కేటాయించామని మంత్రి దుర్గేష్ వివరించారు. ఉండ్రాజవరం, నిడదవోలు రూరల్, పెరవలి మండలాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రికి మంత్రి దుర్గేష్ విన్నవించిన కీలక అంశాలు:
నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛలను నెరవేర్చాలని కోరుతూ మంత్రి దుర్గేష్ సీఎంకు విజ్ఞప్తి చేశారు. నిడదవోలు -తాడేపల్లిగూడెం కలిపే ప్రధాన రహదారి మార్గంలో కీలకమైన కంసాలి పాలెం- మాధవరం వంతెన ఎర్రకాలువ ఉధృతికి కొట్టుకుపోయిందని.. దాన్ని పునర్నించాలని విజ్ఞప్తి చేశారు.. తద్వారా 25 గ్రామాల్లోని 10000 మంది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. 30-40 దేవాలయాలకు, స్మశాన వాటిక లకు వెళ్లేందుకు ప్రధాన మార్గమైన చినకాశి రేవు వంతెన నిర్మాణానికి 5.50 కోట్లతో ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించామన్నారు. స్థానికంగా ఉన్న 30 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కోరారు.. గత ప్రభుత్వం హెచ్ఆర్ సాంక్షనింగ్ లేకుండా మసిపూసి మారేడు కాయ చేసిందని.. ఇది ఒక కంటితుడుపు చర్యగా పేర్కొన్నారు. తాము సీఎం ను ప్రత్యేకంగా కలిసిన సందర్భంలో హెచ్ఆర్ పాలసీ ప్రకారం వైద్యులు, సిబ్బంది జీతభత్యాలు, బిల్డింగ్ నిర్మాణానికి పూర్తిస్థాయి అనుమతులు ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుందని సీఎం అన్నట్లు గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇండోర్ స్టేడియం నిర్మించాలన్న సంకల్పం మేరకు నిడదవోలులో కూడా మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. రోడ్ కం రైల్ బ్రిడ్జి లేని సమయంలో నిడదవోలు బస్టాండ్ కి ఘన చరిత్ర ఉండేదని.. ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉందని తెలిపారు.. ప్రత్యేక దృష్టిసారించి బస్టాండ్ ఆధునికీకరణకు చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. ప్రతి ఏటా ఎర్రకాలువ ముంపు వల్ల పదివేల ఎకరాలు ముంపు గురవుతుందని తద్వారా వేలాది మంది రైతాంగం నష్టపోతున్నారని సీఎం దృష్టికి మంత్రి దుర్గేష్ తీసుకొచ్చారు.. ఇప్పటికే ఎంపీ పురందేశ్వరి నేతృత్వంలో సంబంధిత ఎర్రకాలువ ముంపుకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రతిపాదనలు పంపినట్లు గుర్తుచేశారు. నిడదవోలు నుండి ఎర్నగూడెం వెళ్లే రహదారిని బాగు చేయాలని కోరారు.. 2014 -19 మధ్యకాలంలో టిడ్ కో ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని, కానీ గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి గడిచిన 5 ఏళ్లలో ఆ ఇంటి నిర్మాణాలను నాశనం చేసిందన్నారు.. కూటమి ప్రభుత్వంలో తిరిగి ఆ నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత తమపై ఉందని మంత్రి దుర్గేష్ అన్నారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ – అద్భుత పాలన:
“ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయం కలిసి నిడదవోలును అభివృద్ధి వైపు నడిపిస్తున్నాయి. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పరుగులు పెడుతోంది. సూపర్ సిక్స్ పథకాలు ఇంటింటికీ చేరువయ్యాయి” అని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. మంత్రి దుర్గేష్ నాయకత్వంలో నిడదవోలు అభివృద్ధి చెందుతున్న తీరును, స్థానిక యంత్రాంగం పనితీరును ప్రత్యేకంగా అభినందించారు.
అంతకుముందు పట్టణంలోని ఎంవీ నగర్ లోని మారుతి లే అవుట్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు కు మంత్రి దుర్గేష్ సహచర ప్రతినిధులతో కలిసి ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ ఇన్చార్జ్ బూరుగుపల్లి శేషారావు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


