నరసాపురం : మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి మద్దతుగా పశ్చిమగోదావరిజిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నరసాపురంలో విశేష కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు దిశగా ముందుకు తీసుకెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గన్నాబత్తుల సత్యవతి నాయకత్వంలో భారీ ర్యాలీ చేపట్టారు.
కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా: ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే సంకల్పంతో తీసుకున్న ఈ నిర్ణయం మహిళల రాజకీయ సాధికారతకు కొత్త దిశను నిర్దేశిస్తోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మహిళల అభివృద్ధి, సంక్షేమం, స్వావలంబన కోసం అనేక కీలక కార్యక్రమాలు అమలు అవుతున్నాయని ఆమె అన్నారు. ఈ బిల్లుతో మహిళలకు రాజకీయ రంగంలో మరింత ప్రాధాన్యం లభించి, సమాన హక్కులు అవకాశాలు మరింత బలోపేతం అవుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి నిషిధ రాజు హాజరయ్యారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, కళాశాల విద్యార్థినిలు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేసారు.
మహిళా రిజర్వేషన్ చట్టసవరణ బిల్లు భారత రాజకీయచరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నరసాపురంలో విశేష కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు దిశగా ముందుకు తీసుకెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జిల్లా అధ్యక్షురాలు గన్నాబత్తుల సత్యవతి నాయకత్వంలో భారీ ర్యాలీ చేపట్టారు.
కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా: ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే సంకల్పంతో తీసుకున్న ఈ నిర్ణయం మహిళల రాజకీయ సాధికారతకు కొత్త దిశను నిర్దేశిస్తోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మహిళల అభివృద్ధి, సంక్షేమం, స్వావలంబన కోసం అనేక కీలక కార్యక్రమాలు అమలు అవుతున్నాయని ఆమె అన్నారు. ఈ బిల్లుతో మహిళలకు రాజకీయ రంగంలో మరింత ప్రాధాన్యం లభించి, సమానహక్కులు, అవకాశాలు మరింత బలోపేతం అవుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి నిషిధ రాజు హాజరయ్యారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, కళాశాల విద్యార్థినిలు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేసారు.


