సామాజిక,ఆర్ధిక అసమానతలు అంతానికి శ్రమజీవులకు సంపద పునః పంపిణీ జరగాలి…

ప్రజా రిపబ్లిక్ ఉద్యమ కన్వీనర్ డి.వి.వి.ఎస్. వర్మ…

​తణుకు,ఏప్రిల్ 7
దేశంలో పేరుకుపోయిన ఆర్థిక, సామాజిక అసమానతలను అంతమొందించేందుకు సంపద సృష్టికర్తలైన శ్రమజీవులకు సంపద పునః పంపిణీ జరగాలని, కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని ప్రజా రిపబ్లిక్ ఉద్యమ కన్వీనర్ డి.వి.వి.ఎస్. వర్మ పిలుపునిచ్చారు.
​మంగళవారం తణుకులోని వంక సత్యనారాయణ సురాజ్య భవన్ నందు సీపీఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో “సామాజిక న్యాయం – ఆర్థిక అసమానతలు” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వర్మ పలు కీలక అంశాలను లేవనెత్తారు.
​సామాజిక న్యాయ సాధనకు అవరోధంగా ఉన్న మనువాదాన్ని, ఆర్థిక అసమానతలను తొలగించేందుకు కృషి చేసిన జ్యోతిరావ్ పూలే (ఏప్రిల్ 11), డా. బి.ఆర్. అంబేద్కర్ (ఏప్రిల్ 14) జయంతి ఉత్సవాలను ఊరూరా నిర్వహించి వారి ఆశయాలను చాటాలని కోరారు.
​కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల దేశంలోని 75 శాతం సంపద కేవలం 10 శాతం కుబేరుల చేతుల్లోనే ఉండిపోయిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని నాయకులు విమర్శించారు.ఆర్థిక న్యాయం చేకూరినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, సంపద ఒకే చోట కేంద్రీకృతం కాకుండా పేదలకు అందేలా బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, సామాజిక న్యాయ పోరాట సమితి అధ్యక్షుడు పి. మురళీకుమార్, కాంగ్రెస్ నాయకులు కడలి రామారావు, దిర్శిపో రామకృష్ణ, పూలే-అంబేద్కర్ భావజాల కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి పొట్ల సురేష్, జాతీయ వేదిక కార్యదర్శి డాక్టర్ బి. రమేష్ చంద్రబాబు, మైనారిటీ నాయకుడు అంజాద్ ఆలీ, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి, ఏఐటీయూసీ నాయకులు దేవ పెద్దిరాజు, మందుల ముత్తయ్య, కె. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link