నాడు నరకప్రాయం – నేడు సుఖవంతమైన ప్రయాణం

కూటమి ప్రభుత్వం లో రోడ్ల విప్లవం తెచ్చారన్న మంత్రి కందుల దుర్గేష్
ఉండ్రాజవరం లో రూ. 4 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్
కూటమి ప్రభుత్వ హయాంలో రోడ్లకు పునర్వైభవం తెచ్చామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.  శనివారం మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలో పర్యటించారు. ఉండ్రాజవరం గ్రామంలో రూ. 4 కోట్ల ఆర్ అండ్ బి నిధులతో నూతనంగా నిర్మించిన 1.2 కిలోమీటర్ల ప్రధాన సీసీ రహదారిని ఆయన స్వయంగా పరిశీలించారు. రోడ్డు నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన  అనంతరం మంత్రి దుర్గేష్ స్వయంగా ఆ రోడ్డు పై నడుస్తూ గ్రామస్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ నుండి స్థానికంగా కొలువై ఉన్న  శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వరకు బైక్ పై ప్రయాణించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉండ్రాజవరం నుండి కొండాలమ్మ దేవాలయం వరకు నిర్మించిన ఈ 1200 మీటర్ల సీసీ రోడ్డు వల్ల స్థానిక వ్యాపారులకు, ప్రజలకు ప్రయాణ కష్టాలు తొలిగాయని, ప్రజల ముఖాల్లో కనిపిస్తున్న చిరునవ్వే కూటమి ప్రభుత్వానికి అసలైన నిదర్శనమన్నారు.

ఈ కార్యక్రమంలో నిడదవోలు టిడిపినాయకులు గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం, ఉండ్రాజవరం మండల టిడిపి ఆధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, ఉండ్రాజవరం పి.ఏ.సి.ఎస్. అధ్యక్షులు గన్నమని రాము, నిడదవోలు ఏఎంసి డైరెక్టర్ హనుమంతు వెంకన్న, కోటిపల్లి సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ నాయకులు కాకర్ల కరుణాకర్, బలగం సతీష్, హనుమంతు పండు, కైగాల శ్రీను, బత్తుల సాయి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link