అమరావతి రాజధాని బిల్లు ఆమోదం.. నిడదవోలులో కూటమి శ్రేణులు ఘనంగా సంబరాలు

నిడదవోలు: అమరావతి రాజధాని బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపు మేరకు నిడదవోలు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని ఐ లవ్ నిడదవోలు సెంటర్ లో ఘనంగా సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా అమరావతి బిల్లు ఆమోదానికి సంపూర్ణ సహకారం అందించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వేడుకలను అంగరంగ వైభవం గా నిర్వహించారు. నిడదవోలు పట్టణంలో కూటమి నాయకులు భారీ ఎత్తున బాణాసంచా పేల్చి సందడి చేశారు. అనంతరం ‘అమరావతి రాజధాని’ పేరుతో కేక్ కట్ చేసి తమ మద్దతును, సంతోషాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నిడదవోలు పురవీధులన్నీ “జై అమరావతి” నినాదాలతో మారుమోగాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రి కందుల దుర్గేష్ ల నాయకత్వం వర్ధిల్లాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.కూటమి నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన ఈ సంబరాలతో నిడదవోలు పట్టణం రంగుల కాంతులతో పండుగ వాతావరణాన్ని తలపిస్తూ వెలిగిపోయింది.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి కూటమి ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో జనసైనికులు, తెలుగుదేశం మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link