ప్రజాస్వామ్యాన్ని ప్రక్కన పెట్టి దమనకారి పాలనను అవలంబిస్తూ, బీసీ ప్రజల హక్కులను హరిస్తున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై రాష్ట్ర పీఏసీ సభ్యులు అత్తిలి రాజు తీవ్ర ధ్వజమెత్తారు. బీసీ హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు కీలక డిమాండ్లపై కూడా ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించడం బాధాకరం అని పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఈనెల 11వ తేదీన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అమరావతిలోని పూలే మండల్ భవన్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ప్రెస్ క్లబ్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర పీఏసీ సభ్యులు అత్తిలి రాజు మాట్లాడుతూ, బీసీ హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటానికి ప్రభుత్వం స్పందించకపోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు.
రాజమండ్రి నగర కన్వీనర్ వనుము శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర మహిళ కో-కన్వీనర్ నాగేశ్వరీ శ్రీ, రాష్ట్ర యూత్ కన్వీనర్ మారిశెట్టి సూరి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు టి.శీతల్, జిల్లా యూత్ కన్వీనర్ నీలపాల సాయి మణికంఠ, గోపాలపురం నియోజకవర్గం కన్వీనర్ ప్రభాకర్, జిల్లా కో-కన్వీనర్ జే. లక్ష్మణ్, నిడదవోలు నియోజకవర్గ యూత్ కన్వీనర్ రాజ్ కుమార్, రాజమండ్రి రూరల్ నాయకులు గౌతమ్, రాజా నగరం నాయకులు సాయి, అంకం నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.


