ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తణుకులో నిర్వహించిన ఉగాది ఉత్సవం మరియు పదసంచలనం కార్యక్రమం అత్యంత వైభవంగా, శోభాయమానంగా జరిగింది. మాంటిసోరి స్కూల్ గ్రౌండ్స్‌లో మాన్యనీయ సంఘచాలక్ శ్రీ మద్దిపాటి రాజశేఖర్ ఆధ్వర్యంలో స్వయంసేవకులు పూర్తి గణవేష్‌లో పాల్గొని క్రమశిక్షణ, దేశభక్తి భావాలను ప్రతిబింబించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జే.కే హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ తంగిరాల తిరుమల ప్రకాశ్ నాగేంద్రనాథ్ హాజరై సందేశం అందించారు. ముఖ్య వక్తగా శ్రీ కోర్సిపాటి శ్యాం ప్రసాద్ రెడ్డి పాల్గొని సంఘ భావజాలం, సమాజ నిర్మాణంలో స్వయంసేవకుల పాత్రపై ప్రేరణాత్మక ప్రసంగం చేశారు.
ఈ ఉత్సవంలో డాక్టర్ ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ (హరి బాబు), శ్రీమతి ముళ్ళపూడి రేణుక, శ్రీమతి అయినంపూడి శ్రీదేవి, శ్రీ బొల్లాడ నాగరాజు, విహెచ్పి ప్రాంత కార్యవర్గ సభ్యులు సుబ్బరాజు తదితర ప్రముఖులు పాల్గొని కార్యక్రమానికి మరింత గౌరవం చేకూర్చారు.
మాతృమూర్తులు, వ్యాపారవేత్తలు, చిన్నారి స్వయంసేవకులు సహా అనేక మంది పెద్ద ఎత్తున హాజరై ఉత్సవాన్ని విజయవంతం చేశారు. ఉగాదిని ప్రతిబింబిస్తూ సాంస్కృతిక విలువలు, సంఘ బలం, సామూహిక చైతన్యం ప్రతిఫలించిన ఈ కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.


