ఘనంగా  నిడదవోలులో  వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం

నిడదవోలు (అక్షరభూమి)

వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో నిడదవోలు మాజీ శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జి. శ్రీనివాస్ నాయుడు వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పక్షపాతి నిరంతరం బడుగు బలహీన వర్గాల క్షేమం కోరుకునే జగన్ మోహన్ రెడ్డి ఆశయ సాధనలో వైసీపీ పార్టీ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గం  మండల వైసీపీ అధ్యక్షులు వివిధ గ్రామాల సర్పంచ్ లు భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link