నాబార్డు నిధులతో గ్రామీణ రోడ్లు అభివృద్ధి

రూ. 9.59 కోట్లుతో రోడ్లు నిర్మాణానికి చర్యలు

కూటమి ప్రభుత్వంలో రోడ్లు అభివృద్ధికి ప్రాధాన్యత

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

            ***

తణుకు నియోజకవర్గంలో నాబార్డు నిధులతో గ్రామీణ రోడ్లు నిర్మాణానికి ప్రణాళికలు చేపడుతున్నామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రూ. 18.44 కిలో మీటర్లు మేర రోడ్లు నిర్మాణానికి రూ. 9.59 కోట్లు నిధులతో గ్రామీణ పంచాయతీ రాజ్‌ శాఖ నుంచి పరిపాలన ఉత్తర్వులు వచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించిన వైసీపీ ప్రభుత్వం అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వాటిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాబోయే వర్షాకాలం నాటికి నియోజకవవర్గంలో దాదాపు అన్ని రోడ్లు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. తణుకు మండలం మండపాక నుంచి దువ్వ, ఉరదాళ్లపాలెం వయా కొండాయపాలెం రోడ్డు 3.69 కిలోమీటర్లు మేర రూ. 2.03 కోట్లు, తణుకు మండలం వేల్పూరు రైల్వే స్టేషన్‌ రోడ్డు నుంచి అత్తిలి కెనాల్‌ మీదుగా యర్రనీలిగుంట వరకు 2.91 కిలోమీటర్లు మేర రోడ్డు రూ. 1.70 కోట్లు, పైడిపర్రు నుంచి కొండాయపాలెం వరకు 2.82 కిలోమీటర్లు మేర రూ. 1.55 కోట్లు, జాతీయ రహదారి నుంచి ముద్దాపురం వరకు 2.57 కిలోమీర్లు మేర రూ. 1.42 కోట్లు, జాతీయ రహదారి నుంచి ఇరగవరం మీదుగా రామయ్యపుంత గట్టు వరకు 1.79 కిలోమీటర్లు మేర రూ. 99 లక్షలు, వేల్పూరు కావలిపురం మీదుగా మంగళ్లపుంత వరకు 1.04 కిలోమీటర్లు మేర రూ. 58 లక్షలు, తణుకు నుంచి అజ్జరం పుంత రోడ్డు 1.40 కిలోమీటర్లు రూ. 55 లక్షలు, అత్తిలి నుంచి గుమ్మంపాడు వరకు 2.20 కిలోమీటర్లు రూ. 77 లక్షలతో రోడ్డు నిర్మాణాలు చేపట్టామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రోడ్లు అభివృద్ధిలో భాంగా మొదటి దశలో నిధులను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు.

Scroll to Top
Share via
Copy link