నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో కోకో రైతులకు అవగాహన సదస్సు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కోకో సాగు చేసుకునే రైతులకు కు ఫెర్మెంటేషన్ విధానానికి 70 శాతం రాయితీ ఉంటుందని డి. హెచ్. ఓ. తూర్పుగోదావరి జిల్లా వివరించారు. 35% ఎం.ఐ.డి.హెచ్. ద్వారా 35 శాతం ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రాయితీని పొందవచ్చని కోకో రైతులకు తెలియజేశారు. ఈ రాయితీని పొందాలంటే బ్యాంకు లోన్ కి అప్లై చేసుకోవాలని అన్నారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ.దుర్గేష్ మాట్లాడుతూ డ్రిప్ గురించి, ఫుడ్ ప్రాసెసింగ్ లో వచ్చే రాయితీల గురించి ఆయన రైతులకు తెలియజేశారు. అదేవిధంగా ఉద్యానశాఖ అధికారి జి. రమేష్ మాట్లాడుతూ ఉద్యానశాఖ లో వచ్చే వివిధ రకాల రాయితీలు మరియు ఫెర్మెంటేషన్ విధానాన్ని వివరించడం జరిగింది. మాండిల్స్ కంపెనీ ప్రతినిధి స్వరూప్ మాట్లాడుతూ కాయ కుళ్ళు తెగులు మరియు దాని నివారణ ఆయన వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కోరుమామిడి ఉప సర్పంచ్ కాశీ, సొసైటీ ప్రెసిడెంట్ మట్టపర్తి చంద్రరావు, జనసేన ప్రెసిడెంట్ శ్రీను, ఉద్యాన శాఖ డి.హెచ్.ఓ.మల్లికార్జునరావు, ఉద్యానశాఖ అధికారి రమేష్ , పి.డి. ఏ.దుర్గేష్ మరియు హెచ్.ఈ.ఒ. వివేక్ గ్రామ ఉద్యాన వ్యవసాయ సహాయకులు.పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.


