దానేశ్వరి అమ్మవారి ఆలయం విస్తరించేందుకు చర్యలు

రూ. 3 కోట్లు సిజిఎఫ్ నిధులు ప్రభుత్వం నుంచి విడుదల

గ్రామస్తుల సహకారంతో మరో రూ. కోటి నిధులు సేకరణ

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

దానేశ్వరి అమ్మవారి ఆలయం పునః ప్రతిష్ట కార్యక్రమం

తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసిన దానేశ్వరి అమ్మవారి ఆలయాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. దానేశ్వరి అమ్మవారి ఆలయం పునః ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ, కృష్ణ తులసి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం రూ.3 కోట్లు సిజిఎఫ్ నిధులను మంజూరు చేసిందని దీంతో పాటు గ్రామస్తులు మరో రూ. కోటి నిధులను సేకరించడం అభినందనీయమని తెలిపారు. ఈ నిధులతో ఆలయ గోపురం, ప్రాకారం నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేవలం తణుకు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో అమ్మవారి ఆలయానికి ప్రత్యేక స్థానం ఏర్పడిందని తెలిపారు. ఇందుకు అనుగుణంగా రాబోయే రోజుల్లో ఆలయ పరిధిని విస్తరించి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ ప్రత్తి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link