తణుకు నియోజకవర్గం తేతలిలో జరుగుతున్న గోవధను ఆపండి – వైఎస్సార్ సీపీ ఎంబీసి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పెండ్ర వీరన్న

ది18-2-2026 కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరం బిజెపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఒక మీడియా మిత్రుడు తెతలిలో జరుగుతున్న గోవధను ఆపమని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు అంటున్నారని ఆయన ప్రశ్నించగా, వెంటనే కేంద్ర మంత్రి వర్మ మాట్లాడుతూ, ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ఆపొచ్చు కదా అని ఆయన మాట్లాడటం జరిగింది, ఈ విషయంపై ది19-2-2026 నరసాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పెండ్ర వీరన్న మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరావు అధికారంలో ఉండగా ఒక్కరోజు కూడా గోవధ జరగలేదని, ఆ ఫ్యాక్టరీని ఆపించిన ఘనత ఆనాటి ఎమ్మెల్యేగా ఉన్న నాగేశ్వరావుకి దక్కుతుందని వీరన్న అన్నారు. నాగేశ్వరావుని టార్గెట్ గా చేసి కేంద్రమంత్రి వర్మ మాట్లాడుతున్నారని, ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ చేతుల్లోనే ఉన్నదని, మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా గోవధను ఆపవలసింది మీరైతే మాజీ మంత్రి నాగేశ్వరావు పై వ్యాఖ్యలు చేయటం సరికాదని, మీరు ప్రస్తుత తణుకు శాసనసభ్యులు అధికారులు ఉన్నారని మీ దగ్గర అధికార యంత్రాంగం ఉందని గోవధను ఆపటానికి మీరు ఎందుకు వెనకాడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ మంత్రి నాగేశ్వరావు ఒక బలహీన వర్గానికి చెందిన నాయకుడు, కూటమి చేసినా అరాచకాలను ఖండిస్తున్నాడు అన్న ఉద్దేశంతో, కూటమి నాయకులు నాగేశ్వరావుని టార్గెట్గా చేసి మాట్లాడటం సరికాదని, ఇప్పటికైనా తెతలిలో జరుగుతున్న గోవధను ఆపించాలని పెండ్ర వీరన్న డిమాండ్ చేశారు.

Scroll to Top
Share via
Copy link