ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాసు మాట్లాడుతూ పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు ద్వారా 1-19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆరోగ్య పోషక స్థితి, విధ్యకు ప్రాధాన్యత, జీవననాణ్యతను మెరుగుపరచడం కోసం నులిపురుగుల నిర్మూలన లక్ష్యంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పిల్లలకు ఆల్బెండజోల్ 400 మి.గ్రా. నమలగల మాత్రలు సరఫరా చేస్తున్నారు. సదరు కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల మాత్రలు వేసినారు. ఈ కార్యక్రమములో రేలంగి గ్రామ సచివాలయ సిబ్బంది, జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల సిబ్బంది, ఎం.ఎల్.హెచ్.పి., ఏ.ఎన్.ఎం.ఆశావర్కర్లు హాజరయ్యారు.


