ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ మానవతా జిల్లా సెంట్రల్ కమిటీ చైర్మన్ విద్యా కమిటీ చైర్మన్ అయిన అలపాటి నాగేశ్వరరావు శనివారం మృతిచెందినారు. ఆయన అకాల మరణానికి చింతిస్తూ ఉండ్రాజవరం మండల మానవత తరఫున పాలంగి గ్రామంలో ఆయన చిత్రపటానికి మానవత మండల శాఖ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉండ్రాజవరం మానవత మండల అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ సీనియర్ సభ్యుడైన అలపాటి నాగేశ్వరరావు మరణం మానవత సంస్థకు తీరని లోటు అని అన్నారు. అదేవిధంగా మాజీ మండల అధ్యక్షులు కటారి సిద్ధార్థ రాజు మాట్లాడుతూ ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన మానవతా సంస్థ ప్రజాహిత కార్యక్రమాలు సమాజంలో ఎంతో ప్రేరణ అందించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల గౌరవ డైరెక్టర్ తాతిని క్రిష్ణారావు, రీజియన్ కమిటీ కొ-చైర్మన్ వెలిచేటి బోసు, ఆత్మీయ సహకార కమిటీ అధ్యక్షుడు పైపూరి మాణిక్యాలరావు, మద్దిపాటి రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.


