గడువులోగా ఈ- పంట నమోదు చేయించుకోవాలి.

గడువులోగా ఈ పంట నమోదు చేయించుకోవాలి. ఈనెల 20వ తేదీ లోపు ఈ పంట నమోదును తప్పనిసరిగా చేయించుకోవాలని ఏవో బి రాజారావు రైతులను కోరారు. చిలకపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ- పంట నమోదు మరియు ఈ- కేవైసీ విధానాన్ని పరిశీలించడానికి వెళ్లిన సందర్భంలో రైతులకు పలు సూచనలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 20వ తేదీ వరకు సమయం ఇచ్చింది కాబట్టి రబీ సీజన్లో ఎవరైతే పంటను సాగు చేశారో వారి వివరాలను సంబంధిత రైతు సేవా కేంద్ర సిబ్బందికి తెలియచేసి ఈ- పంట నమోదు చేయించుకుని అలాగే ఈసారి రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకోవాలని అలా చేసుకున్న రైతులకు మాత్రమే వ్యవసాయ సంబంధిత పథకాలు పొందడానికి అనగా ముఖ్యంగా ధాన్యం కొనుగోలు చేయడానికి అలాగే పంటల భీమా పొందడానికి అర్హులు అవుతారని తెలిపారు. ఇప్పటికీ మండలం లో 73%(12806 ఎకరాలకు 9382 ఎకరాలలో) ఈ పంట నమోదు పూర్తి అయిందని తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ- పంట నమోదు ఏ రైతుకు ఆ రైతు స్వయంగా కూడా నమోదు చేసుకునే అవకాశం కల్పించింది అని దానిలో భాగంగా ప్రతి రైతు ఏ.పీ.ఏ. ఐ. ఎమ్.ఎస్. యాప్ వారి చరవాణిలో నిక్షిప్తం చేసి వారి ఆధార్ నెంబర్ తో లాగిన్ అయిన పిమ్మట వారి పేరిన ఉన్నటువంటి భూముల వివరాలు అందులో కనిపిస్తాయి అని వాటిని సెలెక్ట్ చేసుకుని వారి పొలం దగ్గరకు వెళ్లి పంట వివరాలు,పంటను ఫోటో తీసి సబ్మిట్ చేసిన తదుపరి సంబంధిత రైతు సేవా కేంద్ర సిబ్బంది లాగిన్ కు వెళ్తుంది అని వారు ఒకసారి వివరాలు అన్ని సరిగా ఉన్నాయో లేవో చూసి అప్రూవ్ చేసిన పిమ్మట ధ్రువీకరణ నిమిత్తంగా మరల రైతు మొబైల్ కు సందేశం వస్తుందని తెలిపారు. అలాగే దీనిపై అవగాహన లేని రైతులు సంబంధిత గ్రామ వ్యవసాయ సిబ్బంది ఈ పంట నమోదు చేసిన పిమ్మట వారి మొబైల్ కు ధృవీకరణ కోసం ఒక మెసేజ్ వస్తుంది అని దానిని క్లిక్ చేసి వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తదుపరి ఓటిపి వస్తుందని తదుపరి వారి పేరున ఏ సర్వే నెంబర్లు ఏ పంటను నమోదు చేశారు అనే వివరాలు కనిపిస్తాయి అని వాటిని ఎంపిక చేసి సబ్మిట్ చేస్తే ఈ- కేవైసీ ప్రక్రియ కూడా పూర్తి అవుతుందని ఇది చాలా సులభతరమైన పద్ధతి కాబట్టి రైతులు దీనిపై అవగాహన పెంచుకోవాలి అని ఒకవేళ ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే దగ్గరలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి సందేహాలు నివృత్తి చేసుకోవాలని తెలిపారు. 👉డిజిటల్ క్రాప్ సర్వే లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఈ పంట నమోదుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు . అలాగే డిజిటల్ అగ్రికల్చర్ లో భాగంగా రైతులు స్వయంగా అగ్రిస్టాక్ యూనికు ఫార్మర్ ఐడిని (11 అంకెలు) జనరేట్ చేసుకోవచ్చని దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుండి తదుపరి వాయిదాలు పీఎం కిసాన్ పథకంలో భాగంగా లబ్ధి పొందడానికి అలాగే ఇతర రాయితీ పథకాలను పొందడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఇప్పటికే ఉండ్రాజవరం మండలంలో 85% మంది(3565 రైతులు) పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు కు ఈ ఐడి నెంబర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. 👉డిజిటల్ వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా రైతులకు ఊబరైజేషన్ ఆఫ్ ఫార్మ్ మిషనరీ మరియు కిసాన్రోన్స్ లో భాగంగా రైతులు వారి వ్యవసాయానికి వినియోగించే నూతన వ్యవసాయ యంత్ర పరికరాలు మరియు కిసాన్ డ్రోన్ లు వారికి సమీపంలో ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడానికి మరియు వాటిని బుక్ చేసుకుని తక్కువ సమయంలో ఎక్కువ మరియు సమర్థవంతంగా యంత్ర పరికరాలను వినియోగించుకోవడానికి చాలా బాగా దోహదపడుతుందని దీని కొరకు రైతులు వారి ఆధార్ మరియు ఫోన్ నెంబర్ తో ఈ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న యెడల సరిపోతుంది అని తెలిపారు. మరిన్ని వివరాలకు దగ్గరలోని రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించాలని కోరారు

Scroll to Top
Share via
Copy link