ఏపీఎస్ఆర్టీసీ తణుకు డిపో నుండి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జ్యోతిర్లింగ మరియు శక్తిపీఠమైన అతి మహిమాన్విత క్షేత్రమైన శ్రీశైలం కి మల్లికార్జున స్వామి భ్రమరాంబ దేవి దర్శనానికి ఫిబ్రవరి 12, 13, 14 తేదీలలో సూపర్ లగ్జరీ పుష్ బ్యాక్ 2 + 2 ఆడియో వీడియో కోచ్ బస్సులను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశామని టికెట్ ధర పెద్దలకు 820/-, పిల్లలకు 450/- అని మరియు శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ, చినకాకాని,మంగళగిరి క్షేత్రాలు దర్శించేటట్లు ప్రత్యేక టూర్ ప్యాకేజీ కూడా ఏర్పాటు చేశామని ఈ బస్సు 14. 2.26 సాయంత్రం 7.00 గంటలకు బయలుదేరి 16.2.2026 డిపో కి చేరుతుంది. సూపర్ లగ్జరీ టూ ప్లస్ టు పుష్ బ్యాక్ ఆడియో వీడియో కోచ్ టికెట్ ధర కేవలం 2200/- మాత్రమే అని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా డిపో మేనేజర్ సుధారాణి తెలిపారు. రిజర్వేషన్ కొరకు 9440419144 నెంబర్ ని సంప్రదించవలెను.


