ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఐటిఐ మేనేజ్మెంట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం విజయవాడలో బుధవారం జరిగినది. ఈ సమావేశములో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఐటిఐ మేనేజ్మెంట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులుగా తణుకు రవీంద్ర ఐటిఐ కాలేజ్ అధినేత బసవా రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఐటిఐ మేనేజ్మెంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగానూ, ఎన్.వి.జి. శ్రీనివాస్, అధ్యక్షులుగా, డి.దామోదర చౌదరి ప్రధానకార్యదర్శిగా, కె.శ్రీనివాస్ రావు ట్రెజర్ గాను ఎన్నుకోబడినారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు బసవారామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటిఐ ల అభివృద్ధికి కృషి చేస్తామని, ఐటిఐలో చదివిన విద్యార్థులకు ఉపాధి కల్పిస్తామని, ఐటిఐల యొక్క సమస్యలను అధికారులతో సంప్రదించి పరిష్కరించుటకు కృషి చేస్తామని తెలియచేసారు.


