స్థానిక యస్.కె.యస్.డి. మహిళా కళాశాల యుజీ & పీజి (అటానమస్)లో ఆదరణ సేవ ఫౌండేషన్ మరియు మణిపాల్ హాస్పటల్ విజయవాడ, జాతీయ సేవా పథకము మరియు ఎన్.సి.సి విభాగం, ఎస్.కె.ఎస్.డి. మహిళా కళాశాల వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ యు. లక్ష్మీసుందరీబాయ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని తమ కళాశాలలో ఏర్పాటు చేయడం సంతోషదాయకమని ఇటువంటి సదస్సులు విద్యార్థినులలో ప్రాధమిక దశలోనే అవగాహన కల్పిస్తే క్యాన్సర్‌లాంటి భయాంకరమైన వ్యాధులు నుండి బయటపడతారని, విద్యార్థినులు అందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, మంచి ఆహారపు అలవాట్లు అలవాటు చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆదరణ ఫౌండేషన్ మరియు ఆరిమిల్లి కృష్ణతులసిగార్కి, డిస్ట్రిక్ట్ కలెక్టర్, పశ్చిమ గోదావరిజిల్లా చదలవాడ నాగరాణి గార్కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీమతి ఆరిమిల్లి కృష్ణతులని, ఐటీ కన్సల్టేషన్, సింగపూర్ వారు మాట్లాడుతూ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాన్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఖర్చుపెట్టి అవగాహన కల్పిస్తున్నాయిని, ప్రతీ సంవత్సరం క్యాన్సర్ రోగులు పెరుగుతున్నారని వారి సంఖ్యను తగ్గించవలసిన అవసరం ఉందనీ, మణిపాల్ హాస్పటల్ వారి సహాకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని 40 సం||ములు దాటిన ప్రతీ మహిళ పరీక్షలు చేయించుకోవాలని, ప్రజలు సిగ్గుపడకుండా ముందుకు వచ్చి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని, మంచి పౌష్టికాహారం, యోగా, ఎక్సైర్‌సైజులు వంటివి దయనందన జీవితంలో తప్పనిసరి చేసుకోవాలని తెలియజేశారు.
విశిష్ట అతిధిగా విచ్చేసిన శ్రీమతి ఖాతీబ్ కౌసర్ బానో, రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్, మాట్లాడుతూ ముందుగా మహిళల ఆలోచన విధానం మారాలని, కుటుంబ సభ్యులతో విధేయతగా ఉంటూ మంచి ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడూ పాజిటివ్ ఆలోచన కల్గివుండాలని, కుటుంబ పనులు ఎన్ని ఉన్నా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇంటి ఆహార పదార్ధాలను అలవాటు చేసుకోవాలని, ఫాస్ట్ఫుడ్లను దూరంగా ఉంచాలని, 30 సం॥రాల వయసులోనే హార్ట్ ఎటాక్ వంటివి రావడం, స్ట్రెస్ పెరగడం వంటివి జరుగుతున్నాయని, ఈ క్యాన్సర్ అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
డా॥ ఎం. శ్రీదివ్య, కన్సల్టెంట్ రేడియోషన్ ఆంకాలజిస్ట్ మాట్లాడుతూ 40 సం॥ములు వచ్చిన ప్రతీ మహిళా గర్భాశయము, రొమ్ము క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు ప్రతీ సంవత్సరం చేయించుకోవాలని, 25సం|ములు వయసు గల వారు కూడా ఈ పరీక్షలు పట్ల అవగాహన ఉండాలని, క్యాన్సర్ టీకాలు అయిన హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్.పి.వి) టీకా తీసుకుంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ 85% శాతం వరకు క్యాన్సర్ రాకుండా కాపాడుతుందని, ఏమైనా ఇబ్బందులు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలని, బ్రస్ట్ క్యాన్సర్‌కు సంబంధించి మామోగ్రామ్. గర్భావయానికి సంబంధించి పాప్‌స్మియర్ టెస్టులు చేయించుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీమతి చిట్టూరి సత్యఉషారాణి, శ్రీమతి అయినంపూడి శ్రీదేవి,ప॥గో॥ బి.జె.పి. ప్రెసిడెంట్. ఎస్. ఆశాజ్యోతి, ఎన్.జి.ఓ. ఎన్.సి.సి. కేర్‌టేకర్ ఏ. దీప్తి, ఎన్.ఎస్.ఎస్. కో-ఆర్డినేటర్స్ శ్రీమతి కె.వి. శ్యామలదేవి, శ్రీ సి.హెచ్, రమేష్ బాబు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.


