స్థానిక రూట్స్ స్కూల్ అఫ్ ఎస్సెన్షియల్ ఫాకల్టీస్ లో ఘనతంత్ర దివస్ చాలా ఘనంగా నిర్వహించారని సంస్థ ప్రిన్సిపాల్ ఎల్. కె. త్రిపాఠీ ఒక ప్రకటనలో తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా స్కూల్ డైరెక్టర్ బి. విద్యాకాంత్ జాతీయ జండాని ఆవిష్కరించి మాట్లాడుతూ విద్యార్ధిని విద్యార్థులలో దేశభక్తి ఉండాలంటే ముందు వ్యక్తిత్వం చాలా అవసరం అన్నారు. మంచి వ్యక్తిత్వం ఉంటే మంచి కుటుంభం, మంచి సమాజం సృష్టించి, భారతదేశంలోనే ఒక మంచి పౌరుడి గా తయారుకావచ్చునని అన్నారు.
అలాగే SSC 2025 ఫలితాలులో 600 కి గాను 596 మార్కులు తో టౌన్ ఫస్ట్ సాధించిన యు. హన్సిత పద్మిని మరియు పాలీసెట్ 25 లో స్టేట్ ఫస్ట్ మార్క్ 120 కి గాను 120 మార్కులు సాధించిన పవన్ సాయిరామ్ కి నగదు బహుమతి, మెమెంటో, శాలువాతో అభినందించారు.
రిపబ్లిక్ డే సందర్భంగా వివిధ సాంస్కృతికకార్యక్రమాలు, చిన్నారుల విచిత్ర వేషధారణ అందరినీ ఆకట్టుకున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూట్స్ డైరెక్టర్ ఎన్. సుధాకర్ వర్మ, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.


