కూలీలకు పని హక్కు కల్పించే ఉపాధి హామీ చట్టం రద్దుచేసి గ్రామీణ పేదలపై దాడి చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బళ్ళ చినవీరభద్రరావు, మండల కన్వీనర్ బండారు వెంకటేశ్వర్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రకమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రిపబ్లిక్ డే సందర్భంగా తణుకు మండలం తేతలి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుంటామని కూలీలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అనేక ఉద్యమ పోరాటాల ఫలితంగా 2005లో ఉపాధి హామీ చట్టం వలన రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటూ గ్రామీణ అభివృద్ధికి ఉపయోగంతో పాటు పేదలకు కొనుగోలు శక్తి కల్పించిందని వీరభద్రరావు, వెంకటేశ్వర్లు చెప్పారు. అటువంటి ప్రాధాన్యత కలిగిన ఉపాధిహామీ చట్టాన్ని రద్దుచేసి ఒక పథకం గా మార్చి కూలీల కడుపు కొట్టిందని వారు విమర్శించారు. కూలీలంతా ఐక్యంగా పోరాడి ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలని అందుకు వ్యవసాయ కార్మిక సంఘం నిర్వహించే ఉద్యమ పోరాటాలలో భాగస్వాములు కావాలని కోరారు, ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు.


