మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఇరగవరం నందు 77వ “గణతంత్ర దినోత్సవ“వేడుకలు

మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఇరగవరం నందు 77వ “గణతంత్ర దినోత్సవ“
వేడుకలు నిర్వహించడం జరిగింది. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇరగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు గణతంత్ర దినోత్సవం స్ఫూర్తిని, భారతదేశ చరిత్ర మరియు స్వాతంత్ర్య పోరాటంలో దాని ప్రత్యేకతను గుర్తు చేసుకుంటూ మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఫోటోకు పూల మాలతో సత్కరించి వందేమాతర గీతాలాపన అనంతరం పరిపాలన అధికారి శ్రీమతి వి.రంగమ్మా రెడ్డి పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. సదరు కార్యక్రమములో మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు, కూటమి నాయకులు, పరిపాలన అధికారి శ్రీమతి వి.రంగమ్మారెడ్డి, మండల స్దాయి అధికారులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది మరియు స్కూల్ విద్యార్ధులు హాజరయ్యారు.

Scroll to Top
Share via
Copy link