కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా రథసప్తమి వేడుకలు

కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామి వారికి సూర్య నమస్కారాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సూర్యప్రభ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే ఆలయ ధర్మకర్తలు చెల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్, పెండ్యాల భవాని, చలుమూరు రాంబాబు, గంగవరపు పద్మావతి, వాడపల్లి సుందర శేషావతారం, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. స్వామి వారి ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొని భక్తి పారవశ్యంతో స్వామి వారిని దర్శించుకుని తరించారు. రథసప్తమి సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తుల జయజయధ్వానాలతో మార్మోగాయి.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.

Scroll to Top
Share via
Copy link