మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఇరగవరం నందు మరియు అన్ని గ్రామ సచివాలయలలో యోగి వేమన జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.
మండల పరిషత్ కార్యాలయం నందు నిర్వహించిన యోగి వేమన వేడుకలలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాసు గారు మాట్లాడుతూ యోగి వేమన గారు సమాజానికి సత్యం, న్యాయం, సమానత్వం అనే విలువలను బోధించిన మహాకవి, తత్వవేత్త, సామాజిక సంస్కర్త ఈరోజు వారి జయంతి సందర్భంగా వారికి వినమ్ర నివాళులు అర్పిస్తూ, వారి ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు అందరం కృషి చేద్దాం అని తెలిపారు.
సదరు కార్యక్రమములో కూటమి నాయకులు మరియు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది హాజరయ్యారు.


