గౌరవ చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి డి. సత్యవతి, తణుకు సబ్ జైల్ ను సందర్శించి అందులో వున్న రిమాండ్ ముద్దాయిలకు అందుచున్న ఆహారవసతి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రిమాండ్ ముద్దాయిల కేసు వివరాలు గురించి అడిగి తెలుసుకుని, ఎవరైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే మండల న్యాయసేవల కమిటీ తణుకు వారి ద్వారా ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తారని, వారానికి రెండు రోజులు జైలు విజిటింగ్ న్యాయవాది, పారా లీగల్ వాలంటీర్ జైలు ను సందర్శించి రిమాండ్ ముద్దాయిలకు వారి కేసులలో సలహాలు ఇస్తారని వారి న్యాయవాదులతో మాట్లాడి వారి కేసుల పురోగతి తెలియచేస్తారని తెలుపుతూ, ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి జీవించి ఉండాలని, క్షణికావేశంలో చేసిన తప్పును సరిదిద్దుకుని మరల రెండవసారి తప్పు చేయకూడదని, అందరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తప్పు చేసి చట్టం తెలియదంటే కుదరదని, చట్టం తప్పుచేసిన వారిని శిక్షిస్తుంది అని, అందరూ సమాజం లో గౌరవంగా జీవించాలంటే కష్టపడి పని చేసుకుని జీవించాలని, చెడుపనులు చేసి కుటుంబానికి, గ్రామానికి దూరంగా ఉండకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి, న్యాయమూర్తులు పి.వి.ఎన్. రంజిత్ కుమార్, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి, జైలు విజిటింగ్ న్యాయవాది ఎస్. లాజరు, పారా లీగల్ వాలంటీర్ కాకర్ల నరసన్న, శ్రీహరి రావు, జైలు వార్డర్ పాల్గొన్నారు.


