మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో అనుబంధంగా నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనలో ప్రముఖ చిత్రకారుడు
డాక్టర్ వెంపటాపు పాల్గొని గోల్డ్ మెడల్,ప్రశంసా పత్రం అందుకున్నారు.
ఆంధ్ర సారస్వత పరిషత్ ఈనెల 3,4,5 తేదీలలో శ్రీ సత్య సాయి స్పిరిచువల్ సిటీ,గుంటూరు లో నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వందకు పైగా చిత్రకారులు పాల్గొని వివిధ చిత్ర కళాఖండాలు ప్రదర్శించారు.
తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు ఎఫెక్షన్ శీర్షికతో చేసిన చిత్రాన్ని ప్రదర్శించి పలువురి ప్రశంసలు అందుకున్నారు.
చిత్రకళా ప్రదర్శన కోఆర్డినేటర్ కళా రత్న ఎస్. విజయ్ కుమార్, అమీర్ ఆర్ట్ అకాడమీ కార్యదర్శి డాక్టర్ అమీర్ జాన్, డ్రీమ్ ఆర్ట్ అకాడమీ డైరెక్టర్ పెరపోగు రమేష్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ చిత్రకారులు కొండూరి నాగేశ్వరరావు, మారేడు రాము, మధు కురువ తదితరులు వెంపటాపునకు బంగారు పతకం ప్రశంసా పత్రం అందించారు.
ఈ సందర్భంగా
డాక్టర్ వెంపటాపును స్వగ్రామం ఇరగవరం ప్రముఖులు, తణుకు పట్టణ ప్రముఖులు అభినందించారు.


