కేంద్రప్రభుత్వము సవరణ చేసిన చట్టాలు వలన ప్రజలకు తీరని నష్టం

కేంద్ర ప్రభుత్వము సవరణ చేసిన చట్టాలు వలన ప్రజలకు తీరని నష్టం కలుగుతుందని ఆలిండియా లాయర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికలు సందర్భంగా తణుకు బార్ అసోసియేషన్ లో మంగళవారం ఆయన న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడినారు. చట్టాలు వల్ల ప్రజలకు మేలు జరగాలి గాని నష్టాలు జరగకూడదని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వము సవరించిన న్యాయ చట్టాలను ప్రజలకు గుదిబండగా ఉన్నవని అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన వాక్ స్వతంత్రం కట్టడి చేసే విధంగా ఉన్నదని అన్నారు న్యాయవాది వృత్తిలో న్యాయవాదులకు రక్షణ లేదని న్యాయవాదులపై అనేక దాడులు హత్యలు జరుగుచున్నవిని దేనికి సమగ్రమైన చట్టం చేయాలని సుంకర తెలిపారు. చట్టాలు సవరణలు చేసేటప్పుడు అందరూ అభిప్రాయాలు తీసుకోవాలని, న్యాయవాదులు వృత్తి తో పాటు సామాజిక బాధ్యత కూడా కలిగి ఉండాలని ప్రజల సమస్యలను కూడా తెలుసుకోవాలని సమస్యలపై స్పందించి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని అప్పుడే న్యాయవాదులకు ప్రజల్లో మంచి పేరు ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని,
కోర్టు ఫీజులు ఐదు శాతం న్యాయవాదుల సంక్షేమానికి బార్ కౌన్సిలకు జమ చేయాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు . న్యాయవాది ల సమస్యలను పరిష్కరించుకొనుటకు న్యాయవాదులందరూ ఐక్యంగ పోరాడాలని ఆయన న్యాయవాదులకు పిలుపునిచ్చారు. బార్ కౌన్సిల్ కు జరిగే ఎన్నికలు న్యాయవాదుల యొక్క సంక్షేమాన్ని గేటు రాయి లాంటిదని అందువల్ల ఎన్నికల్లో ఓటుకు ప్రాధాన్యత ఇవ్వాలని న్యాయవాదుల సమస్యలు పై పనిచేసే వారికే ఓట్లు చేయాలని ఆయన న్యాయవాదులు కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోల్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సోడే గోపికృష్ణ, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, జి.అంబేద్కర్, మంగిన శ్రీనివాస్ బాబా, మేక ఈశ్వరయ్య, కామన మునిస్వామి, పీ.వీ.పీ లక్ష్మి వేణుగోపాల్ చౌదరి, ఎం.మణికంఠ, గూడూరి వెంకటేశ్వరరావు, నేతల సోమేశ్వరరావు, మళ్లీపూడి సువర్ణరాజు, చింతపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link