ఘనంగా ప్రముఖ మహిళా సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే జయంతి

ప్రముఖ మహిళా సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే జయంతి పురస్కరించుకుని తణుకులో స్థానిక పాత ఊరు వంతెన వద్ద ఉన్న జ్యోతిరావు ఫూలే సావిత్రిబాయి ఫూలే విగ్రహాల వద్ద శనివారం సావిత్రిబాయి ఫూలే జయంతిని తెలుగుదేశం కూటమి నాయకులతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలే విగ్రహ దాతలైన ఎక్స్ వీవర్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి వావిలాల సరళాదేవి తొలుత విగ్రహానికి పూలమాలవేసి నివాళులు సమర్పించారు.
అనంతరం కూటమి నాయకులు బిజెపి టౌన్ ప్రెసిడెంట్ బొల్లాడనాగరాజు, జనసేన టౌన్ ప్రెసిడెంట్ కొమ్మిరెడ్డి శ్రీనివాసు, జిల్లా అధికార ప్రతినిధి బసవ రామకృష్ణ, రాష్ట్ర నాయకురాలు తామరపు రమణమ్మ, బీసీ టౌన్ ప్రెసిడెంట్ తామరాపు సత్యనారాయణ, టౌన్ సెక్రెటరీ రమాదేవి, ఊట రామకృష్ణ, చింతలపూడి సన్యాసిరావు, ఎక్స్ కౌన్సిలర్ సప్పా రాజు, గుబ్బల శ్రీనివాస్, ఎలుబూడి ఈశ్వరరావు, కౌరు వెంకటేశ్వరరావు, నక్క సుబ్బారావు, కాజులూరు చంద్రశేఖర్, కె.గంగ, కె సుబ్బలక్ష్మి, కె.రమాదేవి, ఎ.
సత్యనారాయణ, తేతలి రెడ్డి తదితరులు జ్యోతిరావు పూలే సావిత్రి భాయ్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులు సమర్పించారు.
ఈ సందర్భంగా వావిలాల సరళాదేవి మాట్లాడుతూ చదువుకున్న ప్రతి మహిళ తన తల్లి తర్వాత సావిత్రి భాయ్ పూలే ని స్మరించుకోవాలన్నారు,మనదేశంలో ఉన్న ప్రతి మహిళ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని, భర్త జ్యోతిరావు ఫూలే నేర్పిన చదువుతో వెలుగు చూడని మహిళల జీవితాలలోచదువు అనే జ్యోతిని వెలిగించిన ధ్రువతారని, ఆ చదువు నేర్పే సమయంలో ఆమె పడ్డ కష్టాలు ప్రతి ఒక్కరూ గమనించాలని, ఎన్నో పాఠశాలలను నిర్మించి మహిళల
జీవితాల్లో వెలుగును నింపారని, ఎన్నో కష్టాలకు గురవుతున్న అనాధ మహిళలకు ఆశ్రమాలను నిర్మించి, ఆ సమయంలో కులమతాలకు అతీతంగా అందరినీ అక్కున చేర్చుకుని ఆశ్రమాలలో ఆశ్రయం కల్పించారని, శిరోముండనం, సతీసహగమనం వంటి దురాలోచనలను దూరం చేసేలా మహిళలకు చైతన్యం కల్పించారని
ఆమె చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఆమె జయంతికి సెలవు ప్రకటించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా అన్న ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీలో కూటమి నాయకులు ఆ దిశలో పయనిస్తున్నందుకు వారికి మనం సహకరించాలని సరళాదేవి కోరారు.
అనంతరం జనసేన అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ బడుగు బలహీన వర్గాల నాయకుల చరిత్రలను వారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నారని వారి జయంతి వేడుకలను ఎంతో గొప్పగా నెరవేరుస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారని తెలియజేశారు.

Scroll to Top
Share via
Copy link