సి.యం. చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేసిన తణుకు ఆర్యవైశ్యులు

ఆర్యవైశ్యుల చిరకాల వాంఛ ‘వాసవి పెనుగొండ’

తణుకులో ఆర్యవైశ్యుల కృతజ్ఞత సమావేశం

కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు పెద్ద పీట

ఎమ్మెల్యే రాధాకృష్ణను సత్కరించిన ఆర్యవైశ్యులు

వాసవి పుణ్యక్షేత్రమైన పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండ గా ప్రభుత్వం అధికారికంగా నామకరణం చేయడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం తణుకులో కృతజ్ఞత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులు గర్వంగా చెప్పుకునే విషయం వాసవి పెనుగొండ అన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా తణుకు నుంచి ఎలాంటి కృతజ్ఞత సమావేశం ఏర్పాటు ప్రారంభించడం విశేషం అన్నారు. ధర్మానికి కట్టుబడి అహింసా మార్గంలో స్నేహపూర్వకంగా నడిచే ఆర్యవైశ్య వర్గం కావడం గర్వకారణం అని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించి రాబోయే ఏప్రిల్ నెల నుంచి ఆర్యవైశ్య మహిళ అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు. ఆర్యవైశ్యులలో మహిళలకు ప్రాధాన్యత కల్పించే విధంగా వారిలో వ్యాపార దృక్పథాన్ని పెంచేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని వెల్లడించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు పేరుతో అమరావతిలో 6.50 ఎకరాల స్థలం కేటాయించి ట్రస్ట్ కోసం రిజిస్ట్రేషన్ చేయించి రాబోయే రోజుల్లో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని చెప్పారు. రాబోయే రోజుల్లో కుల ధ్రువీకరణ పత్రాల్లో ఆర్యవైశ్య అని చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని త్వరలోనే విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే రాధాకృష్ణను ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link