శ్రీ ఏ యస్ ఎన్ యం ప్రభుత్వ కళాశాలలో ఘనంగా సావిత్రి బాయ్ ఫూలే జయంతి

పాలకొల్లు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) పాలకొల్లు నందు మహిళా సాధికారిత విభాగం మరియు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ విభాగాల ఆధ్వర్యంలో “సావిత్రి బాయ్ ఫూలే జయంతి “ని కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజరాజేశ్వరి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. మొదటిగా ప్రిన్సిపాల్ డాక్టర్.టి. రాజరాజేశ్వరి ఇతర అధ్యాపకులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు .అనంతరం జరిగిన సభలో ప్రిన్సిపాల్ డాక్టర్ టి రాజరాజేశ్వరి మాట్లాడుతూ భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మరియు సంఘ సంస్కర్త, కవయిత్రి సావిత్రి బాయ్ ఫూలే అని ఆమె బాలికలకు, అణగారిన వర్గాలకు విద్యావకాశాలు కల్పించేందుకు అడ్డంకులు ఛేదించి చేసిన కృషిని వివరించారు. బాలికలకు విద్యను అందించేటప్పుడు సంఘములో ఎదురైన సమస్యలను ఎదుర్కొంటారని అందుకు సావిత్రిబాయి పూలే జీవితమే ఉదాహరణ అని తెలియజేసారు.స్త్రీ లు విద్యావంతులు కావలసిన ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ టి కృష్ణ ఐక్యు ఏసి కోఆర్డినేటర్ కె. భద్రాచలం, అకాడమిక్ కోఆర్డినేటర్ వి. యామిని,తెలుగు శాఖాధిపతి డా బూసి వెంకటస్వామి, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కన్వీనర్ డాక్టర్ సి.హెచ్. ఉషారాణి, మహిళా సాధికారత విభాగం కన్వీనర్ శ్రీమతి బి.కే.వి రామలక్ష్మి, ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

Scroll to Top
Share via
Copy link