రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల విజేతలు

స్థానిక ఎస్.కె.ఎస్.డి. మహిళా కళాశాల యుజీ & పీజి (అటానమస్) తణుకులో శ్రీ సత్యసాయి సేవ సంస్థలు విద్యా విభాగము ఆంధ్రప్రదేశ్వారు రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలు 8-సెప్టెంబర్-2025 నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయిసేవ ఆర్గనైజేషన్, తణుకు, పశ్చిమ గోదావరిజిల్లా విజేతలను ప్రకటించారు.

1) వై. ఉజ్వల – బి.ఎస్సీ (కెమిస్ట్రీ) ద్వితీయ సంవత్సరం (ఇంగ్లీష్)

మొదటి బహుమతి

2) కె. ధరణి -బి.ఎస్సీ (కెమిస్ట్రీ) ద్వితీయ సంవత్సరం (తెలుగు)

మొదటి బహుమతి

3) ఎస్. మనీషా- బి.ఎస్సీ (స్టాట్) మొదటి సంవత్సరం (తెలుగు)

ద్వితీయ బమహుమతి

4) జె. వినీలగ్రేస్- బి.కాం. (వోకేషనల్) ద్వితీయ సంవత్సరం (తెలుగు)

తృతీయ బహుమతి

పై విద్యార్థినులు పోటీలలో అత్యంత ప్రతిభను కనబరిచారు. రాష్ట్రస్థాయిలో బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ యు. లక్ష్మీసుందరీబాయ్ విజేతలను అభినందించి మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి జన్మదినం పురస్కరించుకొని ఈ పోటీలను ఏర్పాటు చేశారని. విద్యా సంస్థలలో ఆధునిక విద్యతోపాటు మానవతా విలువల యొక్క ఆవశ్యకతను వివరిస్తూ, మరోవైపు విద్యార్థినులకు లోకజ్ఞానంతోపాటు, ఆత్మజ్ఞానాన్ని సంపాదించడమే నిజమైన విద్యని, ఆత్మవిశ్వాసం, సంతృప్తి, త్యాగం ఈ మూడు ఉన్నప్పుడే జీవితం సంపూర్ణమౌతుందని బాబావారి సందేశాన్ని విద్యార్ధినులకు అవగతం చేసుకోవాలని తెలియజేశారు.

వీరిని సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీమతి చిట్టూరి సత్యఉషారాణి, కె. పద్మజారాణి (ఫిజిక్స్ అధ్యాపకులు) మరియు అధ్యాపకులు తదితరులు విజేతలను అభినందించారు.

Scroll to Top
Share via
Copy link