అమల్లోకి తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను తక్షణం రద్దు చేయాల

కార్పొరేట్లకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను తక్షణం రద్దు చేయాలని వేల్పూరు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బళ్ళ చిన వీరభద్రరావు . అధ్యక్షులు వాటాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) సమావేశం వాటాల నాగేశ్వరరావు అధ్యక్షతన స్థానిక పార్వతి దేవి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో యూనియన్ ముద్రించిన నూతన సంవత్సర కాలమాన క్యాలెండర్ ను ఆవిష్కరించారు అనంతరం కార్మికులకు శుభాకాంక్షలు తెలిపి క్యాలెండర్. స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరభద్ర రావు. నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో ఎటువంటి చర్చలు జరపకుండా ఏకపక్షంగా ప్రకటిస్తే వ్యతిరేకించవలసిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయడానికి ముందుకు రావడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన లేబర్ కోడ్ లు అమలతో కార్మికులకు భవిష్యత్తులో ఎటువంటి భద్రతా ఉండదని వారు అన్నారు. కార్మిక సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు. 8 గంటల పని విధానం కార్మిక వర్గం శతాబ్దాల క్రితం పోరాడి సాధించుకున్నరాని వారు గుర్తు చేశారు. అటువంటి కార్మిక వర్గానికి అనుకూలంగా ఉన్న చట్టాలను లేకుండా యాజమాన్యాలకు అనుకూలంగా ఉండే విధంగా కార్మిక చట్టాలు మార్పు చేసి కార్మికుల శ్రమను దోపిడీ చేసి యాజమాన్యాలు మరింత లాభాలు అర్జించడం కోసమే కార్మిక చట్టాలు మార్పు చేశారని వారు విమర్శించారు. ఈ నేపథ్యంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించేందుకు విశాఖలో జరుగుతున్న సిఐటియు 18 వ అఖిలభారత మహాసభలు వేదిక కానున్నదని. సందర్భంగా ఈనెల 4వ తేదీన జరుగుతున్న భారీ బహిరంగ సభకు కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని సభను జయప్రదం చేయాలని వీరభద్రరావు.నాగేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో అల్లాడి నాగ బలరాం. తాళ్ల సత్యనారాయణ.యర్రా మల్లికార్జున రావు. ఆనందం గంగాధర రావు. సోరపల్లి రామకృష్ణ.మల్లాడి మాధవ కృష్ణ. దొంతం శెట్టి ముకుందరావు దున్నే నాగేశ్వరరావు.తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link