2026 నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ని రాజమండ్రిలో ఆయన నివాసం వద్ద హృదయపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు కటకం రామకృష్ణ. ఈ సందర్భంగా మంత్రి వారి చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరింప చేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గం జనసేన నాయకులు బలుసు పద్మనాభం, రాజమండ్రి రూరల్ జనసైనికులు ఎస్కేఎస్ ప్రసాద్ బాబు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.


