రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

:మంత్రి కందుల దుర్గేష్

కొత్త ఆశలు, కొత్త ఆశయాలు,కొత్త లక్ష్యాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న అందరికీ సత్ఫలితాలు కలగాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్

నిడదవోలు: రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి కందుల దుర్గేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాదిన్నర కాలంలో సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని, సరికొత్త ఆశయాలతో 2026 నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని తెలిపారు. ప్రజా క్షేమమే ధ్యేయంగా ఈ ఏడాది మరిన్ని మంచి పనులు చేసేందుకు ప్రజలందరి దీవెనలు ఉండాలని ఆశిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో నిడదవోలు సమగ్రాభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా ఏపీ పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కి పర్యాటకుల గమ్యస్థానంగా మారుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కళలు, సంస్కృతికి పెద్దపీట వేస్తున్నామని వాటికి పునరుజ్జీవం వస్తుందని తెలిపారు. సినిమాటోగ్రఫీలో వినూత్న ఆవిష్కరణలకు నాంది పలికామని, సామాన్యులకు సినిమాను చేరువ చేసేందుకు, రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి దుర్గేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలో, కూటమి ప్రభుత్వం పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతోందని, ఈ ఏడాది మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజలకు చేరవేసేందుకు ప్రజలందరి దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.ప్రతి పేదవాడి ఇంటా సుఖసంతోషాల వెలుగులు నిండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో తులతూగాలని మనసారా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కొత్త ఆశలు, కొత్త ఆశయాలు,కొత్త లక్ష్యాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న అందరికీ సత్ఫలితాలు కలగాలని మంత్రి కందుల దుర్గేష్ భగవంతున్ని వేడుకున్నారు. ఈ శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలకు, నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు, తోటి ప్రజా ప్రతినిధులకు, మీడియా ప్రతినిధులకు, అధికారులకు, విద్యార్థినీ, విద్యార్థులకు, కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసేన వీరమహిళలు, జనసైనికులకు అందరికీ మంత్రి దుర్గేష్ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనోత్సాహంతో ఉన్నతమైన ఆశయాలతో నూతనత్వాన్ని, అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.

Scroll to Top
Share via
Copy link