నూతన సంవత్సరంలో మరింత అభివృద్ధి

ప్రజలు, కూటమి శ్రేణులకు శుభాకాంక్షలు

తెలియజేసిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ

రాబోయే నూతన సంవత్సరంలో రాష్ట్రంలో మరింత అభివృద్ధి, సంక్షేమం అందించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు నియోజకవర్గ ప్రజలకు, టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. నూతన సంవత్సరంలో సంకల్పించిన కార్యక్రమాలు సాధించేలా కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, దేశ ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలో రాష్ట్రంలో మరింత అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు అందించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు.

Scroll to Top
Share via
Copy link