ఇంటింటికి పెన్షన్ వెళ్లదని తప్పుడు ప్రచారం చేసిన వైసీపీ నేతలు

మొదటి మూడు గంటల్లోనే 90 శాతం పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం

పాలి గ్రామంలో పెన్షన్లు పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటింటికి పెన్షన్ ఎవరని జత వైసిపి నాయకులు తప్పుడు ప్రచారం చేశారని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పేదల సేవలో భాగంగా అత్తిలి మండలం పాలి గ్రామంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. తణుకు నియోజకవర్గంలో ప్రతినెల 36,618 మంది లబ్ధిదారులకు రూ. 15.16 కోట్లు పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పారు. ప్రతి నెల ఒకటో తేదీన మొదటి మూడు గంటల్లోనే దాదాపు 90 శాతం మందికి పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. నూతన సంవత్సరంలో జనవరి ఒకటో తేదీ కావడంతో ముందు రోజు డిసెంబర్ 31న పెన్షన్లు అందించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు ఆనందంగా, సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపేట వేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు గతంలో రూ. 3 వేలు పెన్షన్ అందిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రూ. 6 వేలు పెన్షన్ అందిస్తున్నామని గుర్తు చేశారు. నెలలో ఒకటో తేదీన సెలవు వస్తే ముందు రోజు పెన్షన్లు అందించేలా ప్రణాళికలు చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో రూ. 23 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు., జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link