ఛాంపియన్ ఖచ్చితంగా అలరిస్తుంది – హీరో రోషన్

విశాఖపట్నం: డిసెంబర్ 21 (కోస్టల్ న్యూస్)

ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలంటే వాళ్లకు మంచి అనుభూతిని అందించే చిత్రాలు చేయాలి. అందుకే నా ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని కోరుకుంటా అన్నారు హీరో రోషన్. ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘ఛాంపియన్’. ప్రదీప్ అద్వైతం తెరకెక్కించారు. అనస్వర రాజన్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే విశాఖ లో మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహించారు.
హీరో రోషన్ మాట్లాడుతూ
నిజానికి హీరోలంతా 25ఏళ్ల వయసులోనే తెరపైకి వస్తుంటారు. కానీ, నేను 21ఏళ్లకే వచ్చేశాను. వాస్తవానికి యాక్టింగ్ అంటే చాలా భావోద్వేగాలు తెలియాలి. దానికి ఒక పరిణతి కావాలి. అందుకే ‘పెళ్లి సందడి’ తర్వాత కావాలని గ్యాప్ తీసుకున్నా. నటుడిగా నన్ను నేను చాలా మార్చుకున్నాను. ఈక్రమంలోనే ఈ ‘ఛాంపియన్’తో మూడేళ్లు ప్రయాణం చేశాను. ఇప్పుడు సరైన వయసులో సరైన కథతో తిరిగి తెరపైకి వస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.

చిత్రీకరణలో గాయాలు

చరిత్రలో బైరాన్పల్లి గురించి చాలా మందికి తెలుసు. అందులో మైఖేల్ విలియమ్స్ అనే ఒక ఫిక్షనల్ పాత్రను సృష్టించి ఈ కథను సిద్ధం చేశారు దర్శకుడు ప్రదీప్. ఇది 1948 నేపథ్యంలో సాగే యాక్షన్ వార్ డ్రామాగా ఉంటుంది. నేనిందులో ఫుట్బాల్ ఆటగాడిగా కనిపిస్తాను. దీంట్లో పీటర్ మాస్టర్ అద్భుతమైన పోరాట ఘట్టాల్ని సిద్ధం చేశారు. చిత్రీకరణ సమయంలో కొన్ని గాయాలు కూడా అయ్యాయి అన్నారు.

“ఈ సినిమాలో నాకు అనస్వరకు మధ్య నడిచే ప్రేమకథలో మంచి డ్రామా, చక్కటి వినోదం ఉంటాయి. ముఖ్యంగా అనస్వర పాత్రలో చాలా లోతుంటుంది. కథానాయకుడు లక్ష్యాన్ని పరిపూర్ణం చేస్తుంది. దీంట్లో నా ఒక్కడికే కాదు తెరపై కనిపించే ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి పాత్రకీ చక్కటి ప్రారంభం ముగింపు ఉంటాయి. అంతేకాదు ఈ సినిమాలో కనిపించే కారు, గన్స్, ఫుట్బాల్ ఇలా ప్రతి వస్తువు కథకు కీలకమే”. అన్నారు
హీరోయిన్ అనశ్వర మాట్లాడుతూ కచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ మూవీ కాబోతోంది. విశాఖ అంటే చాలా ఇష్టం అన్నారు. నిర్మాత జెమిని కిరణ్ మాట్లాడుతూ గాజువాక పిల్ల ఎలా హిట్ అయిందో గిర గిరా సాంగ్ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా పక్కాగా అందరిని అలరిస్తుంది అన్నారు.

Scroll to Top
Share via
Copy link