ఆరిమిల్లి రాధాకృష్ణ గారి ఆదేశాల ప్రకారం “స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర” కార్యక్రమాలలో భాగంగా ఇరగవరం మండలం కంతేరు గ్రామంలో ఈరోజు అన్నివీధులను కంతేరు కూటమి నాయకుల సహకారంతో మండలం నందలి అందరు పంచాయతీ కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్స్, గ్రీన్ గార్డ్స్ మరియు CRP లతో శుబ్రపరిచి పొడి చెత్త తడి చెత్తను వేరుగా సేకరించి సంపద తయారీ కేంద్రానికి తరలించడం జరిగింది.
సదరు కార్యక్రమములో కూటమి నాయకులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ ఎ.శ్రీనివాసు గారు, మండలం నందలి అందరు పంచాయతీ కార్యదర్శులు,సచివాలయ సిబ్బంది,NREGS సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్స్, గ్రీన్ గార్డ్స్ మరియు CRP లు హాజరయ్యారు.
