రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ సజ్జాపురం, జాతీయ న్యాయ సేవల సంస్థ ఢిల్లీ వారి ఉత్తర్వులు మేరకు చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి D సత్యవతి, తణుకు వారి ఆదేశముల మేరకు సీనియర్ న్యాయవాదులు శ్రీ కౌర్ వెంకటేశ్వర్లు, శ్రీ కామన మునిస్వామి, కుమారి K దుర్గా భవాని మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ శ్రీమతి P మహాలక్ష్మి గారిచే బాల్య వివాహలు వల్ల అనర్థాలు గురించి తెలియచేసి, ఎవరైనా బాల్య వివాహాలు కు పాల్పడినట్లు తెలిస్తే చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098, జాతీయ న్యాయ సేవల సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 15100 మరియు పోలీసు టోల్ ఫ్రీ నెంబర్ 100 కు తెలియ చేయాలని, బాల్య వివాహలు నిరోధించడం కోసం పిల్లలతో ప్రమాణము చేయించి, చదువు పట్ల ఆసక్తి చూపించి బాగా చదువుకోవాలని, చట్ట ప్రకారం ఆడ పిల్లల కు 18 సంవత్సరాలు, మగ పిల్లలకు 21 సంవత్సరాలు నిండిన తరువాతే పెళ్ళిళ్లు చేసుకోవాలని, వయసు రాకుండా పెళ్ళిళ్లు చేస్తే తల్లి తండ్రులు, పెళ్ళి చేసిన పెద్దలు కూడా శిక్ష కు అర్హులని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాల్య వివాహలు ను ప్రోత్సహించ కూడదని, బాల్య వివాహలు ను నిరోధించాలని పిల్లలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ స్కూల్ హెడ్మిస్ట్రెస్ శ్రీమతి P సుజాత, ఎలిమెంటరీ స్కూల్ హెడ్మిస్ట్రెస్ శ్రీమతి N శశి, అంగన్వాడీ టీచర్స్, స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

