ఉండ్రాజవరం బైపాస్ ఫ్లైఒవర్ పనులు ప్రారంభం

సుధీర్ఘకాలం నిర్మాణం జరుపుకుంటూ, ఎంతోమంది ప్రయాణీకులను అనేక ఇబ్బందులకు గురిచేస్తూ, అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న ఉండ్రాజవరం బైపాస్ ఫ్లైఒవర్ పనులు ఊపందుకున్నాయి. ఉండ్రాజవరం ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ దీర్ఘకాల సమస్య పరిష్కారదిశగా మరో కీలక ముందడుగు పడింది. అనేక ప్రయత్నాలు, కాంట్రాక్టర్లతో సమావేశాలు మరియు అధికారులతో నిరంతర చర్చల ఫలితంగా సర్వీస్ రోడ్ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో సమస్యను ప్రస్తావిస్తూ చేసిన కృషి ఫలితంగా, NHAI పాత కాంట్రాక్టర్‌ను మార్చి కొత్త కాంట్రాక్టర్‌ను నియమించింది, తద్వారా పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. ఈ పురోగతికి తోడ్పడిన వెస్ట్ గోదావరి కలెక్టర్ నాగరాణి, R&B మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, NHAI అధికారులు మరియు కేంద్ర మంత్రి వర్మ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసిన తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ

Scroll to Top
Share via
Copy link