ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి పరామర్శ
తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం 28వ వార్డులో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధ్యత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అండగా నిలిచారు. ఆకుల రత్తయ్యకు చెందిన ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు కూటమి నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణసాయం కింద రూ.15 వేలు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసరాలను అందజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మరో రూ.10వేలు ఆర్థిక సాయం చేయగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


