అధునాతన చికిత్సలో భాగంగా కేర్ హాస్పిటల్స్ ముందడుగు

1,000 రోబోటిక్ జీర్ణకోశ శస్త్రచికిత్సలు పూర్తి

ప్రముఖ రోబోటిక్ సర్జన్ డా. బి. బి. దాస్ నేతృత్వంలో కేర్ హాస్పిటల్స్ తూర్పు భారతదేశంలో రోబోటిక్ శస్త్రచికిత్సలకు కొత్త ప్రమాణాలు ఏర్పరుస్తోంది.

విశాఖపట్నం: డిసెంబర్ 5 (కోస్టల్ న్యూస్)

విశాఖపట్నానికి చెందిన ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మరియు రోబోటిక్ సర్జన్ డా.బి.బి. దాస్ మాట్లాడుతూ కేవలం 18 నెలల్లో 1,000 రోబోటిక్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు అని చెప్పారు. ఇది కేవలం ఒక సంఖ్య కాదు అని రోగులకు అత్యంత కచ్చితత్వం, ఇంకా ఎక్కువ భద్రత, తక్కువ నొప్పి, మరియు చాలా త్వరగా కోలుకునే అవకాశం కల్పించడంలో కేర్ హాస్పిటల్స్ తీసుకుంటున్న అధునాతన టెక్నాలజీ పురోగతికి ఇది పెద్ద నిదర్శనం అని తెలియచేసారు. గ్యాస్ట్రోఇంటెస్టినల్ అంటే శరీరంలో ఆహారం జీర్ణమయ్యే అవయవాలు (కడుపు, పేగులు, కాలేయం మొదలైనవి). వీటిలో వచ్చే సమస్యలకు శస్త్రచికిత్సలు సాధారణంగా చాలా క్లిష్టమైనవే. అయితే డా విన్సీ రోబోటిక్ సర్జికల్ సిస్టం వంటి అత్యాధునిక రోబోటిక్ సాంకేతికత వినియోగంతో శస్త్రచికిత్స చిన్న కోతలతో, తక్కువ రక్తస్రావంతో, చాలా కచ్చితంగా, సురక్షితంగా చేయడం సాధ్యమవుతోంది అని దీనివల్ల రోగులు తక్కువ నొప్పితో, తక్కువ ఆసుపత్రి కాలంతో, వేగంగా ఇంటికి తిరిగి వెళ్తున్నారు అని అన్నారు.దశాబ్దాల అనుభవం కలిగిన డా. దాస్, చిన్న కోతలతో చేసే మినిమల్ ఇన్వాసివ్ శస్త్రచికిత్సలు మరియు రోబోటిక్ శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉన్న నిపుణులు కాగా ఆయన ఆంధ్రప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్ మరియు సమీప ప్రాంతాల రోగులకు క్లిష్టమైన జీర్ణాశయ సంబంధిత సమస్యలకు అత్యంత ఖచ్చితమైన, భద్రమైన చికిత్స అందిస్తున్నారు అని తెలియచేసారు.ఈ కార్యక్రమంలో రోబోటిక్ శస్త్రచికిత్స ఎలా రోగుల ఫలితాలను పూర్తిగా మార్చేస్తుందో స్పష్టంగా చూపించారు.

50 ఏళ్ల మహిళకు సూది గుచ్చినంత చిన్న పోర్టుల ద్వారా ఒకేసారి రోబోటిక్ పిత్తాశయం తొలగింపు మరియు హిస్టెరెక్టమీ చేశారు. ఆమె కేవలం 48 గంటల్లో నొప్పి లేకుండా ఇంటికి వెళ్లి సాధారణ జీవితానికి తిరిగి చేరుకుంది అని తెలియచేసారు.

• పునరావృతమయ్యే పోస్ట్-సర్జరీ హెర్నియాతో బాధపడుతున్న 63 ఏళ్ల రోగికి, లోతైన మెష్ అమరిక మరియు ఖచ్చితమైన కుట్టుతో మచ్చలు లేకుండా రోబోటిక్ మరమ్మత్తు చేశారు. ఆయన అసౌకర్యం లేకుండా పూర్తి ఆరోగ్యానికి చేరుకున్నారు అని అన్నారు.

• ప్యాంక్రియాటిక్ రాళ్లు మరియు అనియంత్రిత మధుమేహం ఉన్న మరొక రోగికి చిన్న కీహోల్ పోర్ట్‌లతో సంక్లిష్టమైన రోబోటిక్ ప్యాంక్రియాటోజెజునోస్టమీ చేశారు. ఈ రోగి కదలికలు త్వరగా ప్రారంభించుకుని, ఇన్ఫెక్షన్ రాకుండా, తక్కువ నొప్పితో కోలుకున్నారన్నారు .

అత్యవసర పరిస్థితిలో, ప్రాణాంతక ప్లీహ రక్తస్రావంతో ఉన్న 15 ఏళ్ల బాలుడికి రోబోటిక్ పద్ధతిలో స్ప్లెనెక్టమీ చేసి ప్రాణం కాపాడారు. పెద్ద కోత అవసరం లేకుండా, చాలా తక్కువ రక్త నష్టంతో వేగంగా కోలుకున్నారు అని తెలియచేసారు.
ఈ సందర్భంగా కేర్ హాస్పిటల్స్, విశాఖపట్నం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జి సుఖేష్ రెడ్డి మాట్లాడుతూ, చాలా తక్కువ సమయంలోనే 1,000 రోబోటిక్ గ్యాస్ట్రో శస్త్రచికిత్సలు చేయడం మా వైద్యుల నైపుణ్యానికి, మా మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి పెద్ద ఉదాహరణ. రోబోటిక్ టెక్నాలజీ వల్ల శస్త్రచికిత్సలు ఇంకా కచ్చితంగా, సురక్షితంగా జరుగుతున్నాయి. దీని వలన రోగులు త్వరగా కోలుకుంటున్నారు. తూర్పు భారతదేశంలోని ప్రజలకు అత్యాధునిక చికిత్సలు అందించడంలో ఇది ఒక కీలక ముందడుగు అన్నారు. భవిష్యత్తు వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేర్ హాస్పిటల్స్ అప్‌గ్రేడ్‌డ్ రోబోటిక్ ప్లాట్‌ఫార్మ్‌లు, అడ్వాన్స్‌డ్ ఇమేజింగ్ సిస్టమ్‌లు, మల్టీడిసిప్లినరీ గ్యాస్ట్రోఇంటెస్టినల్ కేర్ మార్గాలు, మరియు వేగంగా కోలుకునే ప్రోటోకాల్స్ ఏర్పాటు చేసి ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేస్తోంది. అత్యుత్తమ వైద్య నిపుణులతో మరియు ఆధునిక మౌలిక వసతులతో విశాఖపట్నం తూర్పు భారతదేశంలో అడ్వాన్స్‌డ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ కేర్ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది అని అన్నారు.

Scroll to Top
Share via
Copy link