తణుకులో ఘనంగా కామ్రేడ్ భూపతిరాజు సుబ్బరాజు వర్ధంతి

తణుకు, డిసెంబర్ 2, 2025 : పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప కమ్యూనిస్టు నాయకులు కామ్రేడ్ భూపతిరాజు సుబ్బరాజు అని శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక స్వాతంత్ర్య సమరయోధుల పార్కులోని ఆయన విగ్రహం వద్ద జరిగిన పద్దెనిమిదవ వర్ధంతి సమావేశానికి తొలుత రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు కోట రామ ప్రసాద్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్, డి.వి.వి.ఎస్.వర్మ, కామ్రేడ్ భూపతిరాజు సుబ్బరాజు కుమారుడు డా.బి.రమేష్ చంద్రబాబు, కుమార్తె ఝాన్సి లక్ష్మి ఆయన విగ్రహానికి పుష్పమాలలతోనూ, పలువురు వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

ఈ సమావేశంలో దారి దీపం సంపాదకులు డి.వి.వి.ఎస్. వర్మ మాట్లాడుతూ, కామ్రేడ్ భూపతిరాజు సుబ్బరాజు నిబద్ధత కలిగిన కమ్యూనిస్ట్ నాయకులని చెప్పారు.
వారు కామ్రేడ్ వంక సత్యనారాయణ సమకాలికులని పేర్కొన్నారు.
వారిరువురూ 1943 వ సంవత్సరంలో ఒక సంవత్సరం రోజులు జైలు జీవితం గడిపారని చెప్పారు.

రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీమతి సంకు మనోరమ మాట్లాడుతూ, కామ్రేడ్ భూపతిరాజు సుబ్బరాజు అనేకమందిని కమ్యూనిస్ట్ ఉద్యమం వైపు నడిపించిన స్పూర్తి ప్రదాత అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సి.పి.ఐ. జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, ప్రముఖ వైద్యులు డా.వత్సవాయి వెంకటరాజు, కామ్రేడ్ భూపతిరాజు సుబ్బరాజు కమ్యూనిస్ట్ పార్టీకి వారు చేసిన సేవలు శ్లాఘనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్ బెల్లంకొండ బుచ్చిబాబు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు, సి.పి.ఐ. నాయకులు బొద్దాని నాగరాజు, డా. దాట్ల సత్యనారాయణ రాజు, వాకర్స్ క్లబ్ నాయకులు కోడూరి ఆంజనేయులు, రాష్ట్ర సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పేరూరి మురళీ కుమార్, తణుకు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు, తెలుగు దేశం నాయకులు తాతపూడి మారుతీరావు, ప్రముఖ న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కోశాధికారి అర్జి భాస్కర రావు, మానవత నాయకులు ఆలపాటి సుబ్బారావు, మాజీ కౌన్సిలర్ కంభంపాటి కాశీపతి, మెడికల్ రెప్రజెంటేటివ్ వి.యన్. శివకుమార్, రిటైర్డ్ లెక్చరర్ వి.గోపాలకృష్ణారెడ్డి, అల్లూరి సూర్యనారాయణరాజు, పులపర్తి సత్యనారాయణ, విడివాడ భాస్కరరావు, కమ్యూనిస్ట్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link