భీమవరంలో ఒక వృద్ధుడి వద్ద నుండి 78 లక్షలు కంబోడియా కి చెందిన సైబర్ నెరగాళ్లు బెంగళూరు పోలీసులమనీ నమ్మించి ఆన్లైన్ మోసం
జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి మీడియా సమావేశం
భీమవరంలో ఒక వృద్ధుడి వద్ద నుండి 78 లక్షలు కంబోడియా కి చెందిన సైబర్ నెరగాళ్లు బెంగళూరు పోలీసులమనీ నమ్మించి ఆన్లైన్ మోసం చేయడం జరిగిందని, దానికి సంబంధించి అన్ని కోణాల్లోనూ విచారణ చేసి స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి దేశం నలుమూలల ఎవరెవరికి లావాదేవీల సంబంధాలు ఉన్నాయో వారిలో కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, ఇంకా విచారణ జరుపుతున్నామని, ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేసామని, ఒకరు పరారీలో ఉన్నారని, వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నామని, నేరానికి పాల్పడిన బ్యాంకుల ఖాతాల్లో ఇప్పటివరకు సుమారు 19 లక్షలు సీజ్ చేయడం జరిగిందని, ప్రజలు ఇలాంటి సైబర్ నేరగాళ్లకు దొరక్కుండా జాగ్రత్త పడాలని, ఏదైనా లావాదేవీల్లో ఇబ్బందులు కలిగితే బ్యాంకు వారిని గాని పోలీసులను గాని 1930 కి ఫోన్ చేసి తెలియచేయాలని కోరారు. ఇందులో చాక్చక్యంగా వ్యవహరించిన పోలీసులను అభినందించారు.




