రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో వరల్డ్ ఎయిడ్స్ డే

రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో వరల్డ్ ఎయిడ్స్ డే సందర్బంగా ముగ్గుల పోటీలు, వక్తృత్వ పోటీలు

శ్రీ ఏ.ఎస్.ఎన్.ఎం గవర్నమెంట్ ఆటోనమస్ కళాశాల, పాలకొల్లు నందు రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో ముగ్గుల పోటీలు మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించారు.

కళాశాల ఆవరణలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ఎయిడ్స్ డే వేర్ నెస్ ను ప్రధాన అంశంగా తీసుకొని విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రతిబింబించారు. ఎర్ర రిబ్బన్ గుర్తు, అవగాహన సందేశాలు, ఆరోగ్య చైతన్య అంశాలను ప్రతిబింబించేలా ముగ్గులు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

అదే విధంగా, వక్తృత్వ పోటీల్లో “ఎవేర్నెస్ ఇస్ ద బెస్ట్ వ్యాక్సిన్” అనే ప్రధాన అంశంపై విద్యార్థులు సమాజంలో అపోహలను నివారించే సందేశాలతో చైతన్యం కలిగించారు. పాల్గొన్న విద్యార్థుల ప్రసంగాలు ఎయిడ్స్ నిరోధకత, అవగాహన, ఆరోగ్యకర జీవనశైలి ప్రాముఖ్యతలను స్పష్టంగా తెలియజేశాయి.

కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.టి. రాజరాజేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్న విద్యార్థుల ప్రతిభను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link