ఏ.పి.స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్లో పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) మోడల్లో, ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో జరిగిన విదేశాలో ఉపాధి అవకాశాలు కాన్ఫరెన్స్ లో పాల్గోవటం జరిగింది. విదేశీ భాషలు మరియు నైపుణ్యాల్లో శిక్షణ అందించి, ఆంధ్రప్రదేశ్ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పలు విదేశీ ట్రైనింగ్ ఏజెన్సీలతో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. విదేశీ దేశాలు, భారతదేశంలోని పలు రాష్ట్రాల నుండి వచ్చిన వివిధ ట్రైనింగ్ సంస్థల ప్రతినిధులు ఈ కాన్ఫరెన్స్ ద్వారా యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి అవకాశాలు, లాంగ్వేజ్ ట్రైనింగ్, విదేశీ ఉపాధి అవకాశాల విస్తరణకు మరింత దిశానిర్ధేశం చేయబడింది. ఈ కార్యక్రమంలో ఏ.పి.స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, APSSDC మేనేజింగ్ డైరెక్టర్ & CEO జి.గణేష్ కుమార్, APSSDC అడ్వైజర్ మిస్ సీతాశర్మ, APNRT అడ్వైజర్ వేమూరు రవి కుమార్, సీడప్ సీఈఓ పి.నారాయణ స్వామి తదితరులు పాల్గోన్నారు.


